YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్నాటక ప్రోటెం స్పీకర్ పై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం

 కర్నాటక ప్రోటెం స్పీకర్ పై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం

కర్ణాటక ప్రోటెమ్ స్పీకర్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ, జెడిఎస్లు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు

కొట్టివేసింది. ప్రస్తుత ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే బల పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్ గా బోపయ్య నియామకంపై కాంగ్రెస్, జెడీఎస్ పిటిషన్ విచారించాలంటే ఆయనకు నోటీసు ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది. అలా చేస్తే అసెంబ్లీలో బలపరీక్ష వాయిదా పడుతుందని అందుకే ఈ పటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు పేర్కొంది. ప్రొటెం స్పీకర్ గా ఎవర్ని నియమించాలో మేం గవర్నర్ ని ఆదేశించలేం. అది ఒక సంప్రదాయం మాత్రమే. చట్టంలో ఏమీ లేదు.కాబట్టి ప్రొటెం స్పీకర్ నియామకాన్ని తప్పుపట్టలేమని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రొటెం స్పీకర్ గా అత్యంత సీనియర్ ను నియమించడం సంప్రదాయం మాత్రమే. అత్యంత సీనియర్ కానివారిని గతంలోనూ నియమించిన సందర్భం ఉందని  సుప్రీంకోర్టు గుర్తు చేసింది. డివిజన్ ఓటు ద్వారా బలపరీక్ష నిర్వహించాలని, ఈ కార్యక్రమం అంతా అన్ని టీవీ చానెళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం ఆదేశించింది. సినీయర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ప్రోటం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించేవరకు ఫర్వాలేదు. కానీ ప్రొటం స్పీకరే బలపరీక్ష సమయంలో కూర్చోవడం సరికాదని అన్నారు. ప్రొటం స్పీకర్ గా బోపన్న ఎన్నికపై మాకు అభ్యంతరాలున్నాయని అయన కోర్టుకు విన్నవించారు. గతంలోనే బోపయ్య స్పీకర్ గా ఉన్నప్పుడు పక్షపాతంతో వ్యవహరించి 20 మంది ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై  చేశారని కపిల్ అన్నారు. యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఆయన డిస్ క్వాలిఫై చేస్తే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని అయన గుర్తు చేసారు. ప్రోటం స్పీకర్ వద్దనుకుంటే ఫ్లోర్ టెస్ట్ వాయిదాపడే అవకాశముంది.. మీ ఇష్టమంటూ కపిల్ సిబల్ తో న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అన్నారు.  ప్రొటం స్పీకర్ బోపయ్యతరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 

Related Posts