YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ పాలిటిక్స్ పై అలనాటి అందాలతార చూపులు..

ఏపీ పాలిటిక్స్ పై అలనాటి అందాలతార చూపులు..

రాజమండ్రి, జూన్ 11,
టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయప్రద చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు. రాజమండ్రి తన జన్మభూమి అయితే.. ఉత్తరప్రదేశ్‌ తన కర్మభూమి అని సభలో జయప్రద చేసిన కామెంట్స్‌ చర్చగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.రాజమండ్రిలో పుట్టిన జయప్రద చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు షాడే గరల్స్‌ స్కూలు, ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుకున్నారు. తర్వాత సినిమాల్లోకి వెళ్లిన తర్వాత టాప్‌ పొజిషన్‌కు చేరుకున్నారు జయప్రద. ఆమెకు రాజకీయాలు కొత్తకాదు. నటిగా కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే 1994లో టీడీపీలో చేరారు. రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు కూడా. టీడీపీతో విభేదాలు రావడంతో సమాజ్‌వాదీపార్టీలో చేరారు జయప్రద. ఆ పార్టీ నుంచి రెండుసార్లు యూపీలోని రాంపూర్‌ నుంచి ఎంపీగా గెలిచారామె. అక్కడ కూడా ఎంతో కాలం ఉండలేదు. 2011లో అమర్‌సింగ్‌తో కలిసి రాష్ట్రీయ లోక్‌మంచ్‌ ఏర్పాటు చేశారు. 2014లో RLDలో చేరి.. బిజ్నోర్‌ నుంచి పోటీ చేసినా కలిసి రాలేదు. చివరకు 2019లో కాషాయ కండువా కప్పుకొని బీజేపీ నేతగా మారారు జయప్రద. ఆ క్రమంలోనే రాజమండ్రిలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు ఆమె రావడం చర్చగా మారింది.నటిగా.. పొలిటికల్‌ లీడర్‌గా బిజీగా ఉన్నా జన్మభూమి రాజమండ్రిని మర్చిపోలేదు జయప్రద. ఐదేళ్లకు ఒకసారైనా ఇక్కడి వచ్చి వెళ్తుంటారు. బంధువులు, స్నేహితులను కలిసి పాత సంగతులు గుర్తు చేసుకుంటారు జయప్రద. యూపీ నుంచి ఎంపీగా ఉన్నప్పుడు రాజమండ్రిలో తాను చదువుకొన్న విద్యాసంస్థల అభివృద్ధికి ఆర్థిక సాయం చేసేవారు. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌ రోల్‌ పోషించాలని చూస్తున్న ఆమె.. ఏపీలోనూ కీలకపాత్ర వహిస్తారని అనుకుంటున్నారట. కేవలం ప్రచార కార్యక్రమాలకే మిగిలిపోకుండా.. వచ్చే ఎన్నికల్లో జయప్రద రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చని చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో రాజమండ్రి నుంచి గిరజాల వెంకటస్వామి నాయుడు, SPBBK సత్యనారాయణరావులు బీజేపీ ఎంపీలుగా గెలిచారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో సత్యనారాయణరావు కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు జయప్రద పోటీ చేస్తే అది రాజమండ్రితోపాటు.. చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ బీజేపీకి అనుకూలంగా మారుతుందని అభిప్రాయ పడుతున్నారట. మరి.. అందాల నటి ఆలోచనలు ఏంటో.. బీజేపీ పెద్దలు ఏమనుకుంటున్నారో చూడాలి.

Related Posts