కడప
మాజీ మంత్రి, కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య అనంతరం సి.బి.ఐ దర్యాప్తు జరుపుతున్న సమయంలో సాక్షులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు అన్నారు. కడపలో విలేకర్లతో మాట్లాడుతూ హత్య జరిగి మూడు సంవత్సరాలు అయినా, సి.బి.ఐ విచారణ జరుపుతున్నా, కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా మరణించడం, సాక్షులకు రక్షణ లేదనే డొల్లతనాన్ని బయటపెడు తున్నదన్నారు.ఇప్పటికైనా మిగిలిఉన్న సాక్షులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని శ్రీనివాస రావు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమై తే ,కేంద్ర ప్రభుత్వ సాయంతో నైనా రక్షణ కల్పించాలన్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి తన బాబాయ్ కేసుకు సంబంధించి సాక్షులకు న్యాయం చేయలేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.సి.బి.ఐ ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారుప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది అన్నారు.ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు.