నంద్యాల మెప్మా కార్యాలయంలో ఓ అధికారి లైంగిక వేధింపుల కు గురిచేస్తున్నారని న్యాయం చేయాలని సీ ఆర్పీ వహిదా మిడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసింది .సి ఆర్పీ. వహిదా మాట్లాడుతూ బాలాజీ కాంప్లెక్స్ లోని బిలాల్ నగర్ ప్రాంతంలో సీఆర్పీగా పనిచేస్తున్న ట్లు తెలిపింది.ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో పనులు చేసుకొని జీవించేవారు అధికంగా ఉన్నారన్నారు.కష్టపడి వచ్చిన డబ్బును పొదుపు చేసుకోలేక పోతున్నవారిని గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెప్మా లో కొందరిని గ్రూప్ సభ్యులుగా చేర్పించి వారికి లోన్లు ఇప్పిస్తూ,వారికి అన్నివిధాలుగా సహకారం చేస్తున్నానని తెలిపింది.ఈ నేపథ్యంలోనే తరుచూ కార్యాలయం వెళుతున్న సమయంలో మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సీఈఓ ఇదృష్ బాషా తరుచూ లైంగికంగా వేదించేవారని అన్నారు.నేను చెప్పిన మాట వినకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరించేవాడని వాపోయింది.సీఈఓ బెదిరింపులు తాళలేక సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపించింది.న్యాయంకోసం స్పందనలో మొరపెట్టుకున్నానని పేర్కొంది.కనీసం మెప్మా కార్యాలయంలో నైనా న్యాయం జరుగుతుందని ఆశతో సిఎంఎం భాస్కర్ రెడ్డి,ఆర్పీ రజియా దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్గొన్నట్లు తెలిపింది.సీఈఓ అధికారుల నుంచి నాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధిత మహిళ కోరింది.