YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బద్వేల్ లో అలజడి..

బద్వేల్ లో అలజడి..

బద్వేలు
బద్వేలులో నకిలీ ఇంటి పట్టాల వ్యవహారం తీవ్ర అలజడి రేపుతుంది బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి గత రెండు మాసాలుగా ఈ అలజడి ఇప్పటికీ అలాగే ఉంది ఏది నకిలీ పట్టా నో ఏది అసలు పట్టా నో తెలియక అధికారులు సైతం అయోమయంలో పడిపోయారు నకిలీ ఇంటి పట్టాలు  లక్షల రూపాయలకు కొనుగోలు చేసినవారు ఇప్పుడు లబో దిబో అంటూ విలపిస్తున్నారు బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ ఇంటి పట్టాల వ్యవహారం నడుస్తుంది పట్టించుకునే వారు లేక పోవడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా ఇంతవరకు సాగింది నకిలీ ఇంటి పట్టాల ఈ వ్యవహారంలో రెవెన్యూ సంబంధించిన ఇంటి దొంగల తోపాటు సంఘములో పేరు ప్రతిష్ఠలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇది ఎవరు కాదనలేని వాస్తవం ఇంటి పట్టాల తో పాటు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు నకిలీ చేయించి వాటిని అన్ని విధాల ఉపయోగించుకున్నారు నకిలీ పట్టాల ద్వారానే కొన్నింటిని అమ్మి కోట్ల రూపాయల్లో సొమ్ము చేసుకున్నారు ఇది కూడా ఎవరు కాదనలేని పచ్చి నిజం బద్వేల్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది ఎవరిని నమ్మలేని పరిస్థితులు గత కొన్ని నెలలుగా ఏర్పడ్డాయి దీనికంతటికీ మూల కారణం నకిలీలే బద్వేలు ఆర్డీవో గా ఆకుల వెంకటరమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నకిలీల వ్యవహారం కొంతవరకైనా బయటపడింది నకిలీ ఇంటి పట్టాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 26 మంది పై కేసులు నమోదు చేశారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు కొంతమంది ముందస్తు బెయిలు పొందారు అరెస్ట్ అయిన వారు కూడా కోర్టు బెయిల్ ఇవ్వడంతో వీరంతా దర్జాగా బయట తిరుగుతున్నారు వీరిని చూస్తే ప్రజలు కూడా ఒక విధంగా భయపడి పోతున్నారు బద్వేల్ లో గత కొన్ని నెలల కాలంలో నకిలీ పట్టా ద్వారా 600 కోట్ల రూపాయలు పైగా వ్యాపారం జరిగిందని ఒక ప్రాథమిక అంచనా బద్వేల్ లో ఒకే స్థలంపై రెండు లేదా 4 సేమ్ టు సేమ్ గా నకిలీ పట్టాలు ఉన్నాయి బద్వేలు గోపవరం మండలాలతో పాటు మిగిలిన మండలాల రెవెన్యూ అధికారుల ముద్రలు టెన్ వన్ అడంగల్ పాస్బుక్కులు ఇతరాత్రా రెవెన్యూ రికార్డులు ఫోర్జరీ చేసే వారి వద్ద గుట్టలుగుట్టలుగా దొరకడం అధికారులు కూడా విస్మయానికి గురిచేస్తుంది రెవెన్యూ అధికార పార్టీ కొందరు నేతల సహకారం లేకుండా నకిలీ పట్టాలు తయారుచేయడం సాధ్యమయ్యే పని కాదు నకిలీ పట్టాలు తయారు చేసే వారి పని పట్టడం జిల్లా కలెక్టర్ విజయరామరాజు బద్వేల్ ఆర్డిఓ ఆకుల వెంకట్ రమణ పట్టుదల గా ఉన్నారు నకిలీ ఇంటి పట్టాలు తదితరాల వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు అతి వేగంగా ఆ రా తీస్తున్నారు ఈ విషయంలో విచారణ ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం నకిలీ పట్టాల ఫోర్జరీ సంతకాలపై నిజాలు తెలుసుకునేందుకు గతంలో గోపవరం మండల తాసిల్దార్ గా పనిచేసిన నలుగురు ఐదుగురికి ఉన్నత అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం కాగా నకిలీ ఇంటి పట్టాల తయారీ వ్యవహారంలో అరెస్టయిన పిల్లి భాస్కర్ పోలీసుల విచారణలో పలువురు రెవెన్యూ అధికారులు సిబ్బంది పేర్లు చెప్పడం జరిగింది వారిలో గతములో డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేసి ప్రస్తుతం తిరుపతి కర్నూలు జిల్లాలో తాసిల్దార్ గా పనిచేస్తున్న దస్తగిరి శ్రీనివాసులు తో పాటు ప్రస్తుత గోపవరం డిప్యూటీ తాసిల్దార్ వెంకటరమణ మరి కొంత మంది పేర్లు పిల్లి భాస్కర్ చెప్పడం జరిగింది వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారని సమాచారం పేరుకు బద్వేల్ అయినప్పటికీ రెవెన్యూ పరిధి అంతా గోపవరం లోకి వస్తుంది వస్తుంది ప్రభుత్వ భూములు ఇంటి స్థలాలు  ఈ మండలానికి వస్తాయి గతంలో 10 సంవత్సరాల కాలంలో కేవలం వెయ్యి మంది మాత్రమే ఇంటి పట్టాలు రెవెన్యూ అధికారులు ఇచ్చారు అయితే శివారు ప్రాంతం కావడంతో ఆర్థిక పరిస్థితులు బాగా లేక కొందరు ఇల్లు నిర్మించుకో లేదు పట్టణం బాగా విస్తరించడం చుట్టుపక్కల మండలాల వారు ఇక్కడ నివాసం ఉండేందుకు చొరవ చూపడంతో శివారు ప్రాంత స్థలాలకు రెక్కలు వచ్చాయి దీన్ని అవకాశంగా తీసుకొని ఫోర్జరీ గాళ్ళు చెలరేగి పోయారు రెవెన్యూ సిబ్బంది అధికార పార్టీ అడ్డుపెట్టుకొని నకిలీ పట్టాలకు స్ట్రెచ్ వేశారు ఒకే స్థలంపై 4 అంతకుమించి పట్టాలు పుట్టించడం సర్వ సాధారణం అయింది నకిలీ పట్టాలకు రెవెన్యూ సహకారం ఎక్కువగా ఉంది ఇది ఎవరు కూడా కాదనలేని బహిరంగ సత్యం నకిలీలు తయారుచేస్తే వాటికి సంబంధించిన రికార్డు లో కూడా నమోదు చేసేవారు రికార్డుల నమోదులో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని పిల్లి భాస్కర్ పోలీసుల విచారణలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఎంతో విలువైన ఎన్జీవో ప్లాట్ లో కూడా 50కి పైగా నకిలీ పట్టాలు ఉన్నాయంటే వీరు ఎంతగా బరి తెగించారు అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది బద్వేలు గోపవరం చుట్టుపక్కల ఉన్న భూములకు పొలాలకు ఇంటి స్థలాలకు ఎక్కడలేని గిరాకి ఉంది డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది దీనిని ఆసరాగా చేసుకొని పేదల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వాగులు వంకలకు  పట్టాలు తయారుచేసి అమ్మకాలు చేశారు అధికారులు ఇటీవల జరిపిన విచారణలో భారీ స్థాయిలో భూముల ఆక్రమణ జరిగినట్లు గుర్తించారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పైగా నకిలీ పట్టాలతో అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించడం జరిగింది పట్టణంలోని ఎన్జీవో కాలనీలో 19 53 సర్వే నెంబర్లో నకిలీ పట్టాలు తయారుచేసి వాటి ద్వారా ఐదు కోట్ల మేరకు వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం అలాగే 9 69 సర్వేనెంబర్ లో నకిలీ పట్టాల ద్వారా అటవీశాఖ బంగ్లా వద్ద 1781 సర్వే నెంబర్లు ఇలాగే నకిలీ పట్టాలు తయారుచేసి వాటి అమ్మకాల ద్వారా లక్షలాది రూపాయలు వెనుక వేసుకున్నట్లు సమాచారం అధికార పార్టీ నేతల అండతోనే భూముల బాగోతం జరుగుతున్నట్లు మొదటినుంచి ఆరోపణలు ఉన్నాయి బద్వేలులో కొందరు బడా నేతలు నకిలీ పట్టాలు తయారుచేయించి వాటి ద్వారా భూముల ఆక్రమణ చేస్తున్నారు పోలీసుల విచారణలో పిల్లి భాస్కర్ పలు విషయాలు బయటపెట్టినట్లు సమాచారం బడా నాయకుల పేర్లతో పాటు నకిలీ పత్రాలు తయారుచేయించి ఇస్తే తమకు ఎంత ఇచ్చేది పిల్లి భాస్కర్ స్పష్టంగా పోలీసులకు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ బద్వేల్ లో నకిలీ పట్టాల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది ఇదిలా ఉండగా గోపవరం తాసిల్దార్ లుగా పనిచేసిన ఐదు మంది సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఆయా తాసిల్దార్ ల పదవీ కాలంలో ఇంటి పట్టాలు ఇవ్వడం లేదా అంతకుముందు తాసిల్దార్ లు పట్టాలు ఇచ్చినట్లు నకిలీలు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు ఆ సంతకాలు తాసిల్దార్ లు చేసినవా లేక నకిలీ పట్టాలు  తయారు చేసినవారు చేసినవా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఐదు మంది తాసిల్దార్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది వీరిలో ఒకరు పదవి విరమణ చేశారు మిగిలిన వారు వివిధ ప్రాంతాలలో పని చేస్తున్నారు నోటీసులకు వీరు స్పందించి విచారణకు వస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి అంతేకాక నకిలీ పట్టాలు అడ్డుపెట్టుకొని నువ్వు భూముల ఆక్రమించడం క్రయ విక్రయాలు జరిపి కోట్లు గడించిన వారు బయటికి రావడం కాయం ఏది ఏమైనప్పటికీ బద్వేల్ లో నకిలీ బాగోతం ఒక అలజడి సృష్టించింది ఇది ఇప్పటికీ అలాగే ఉంది

Related Posts