YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యవసాయరంగం నిర్వీర్యం అయింది

వ్యవసాయరంగం నిర్వీర్యం అయింది

నందిగామ
మూడేళ్ళ వైసీపీ హయాంలో వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేశారు. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో 2552మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.  నందిగామ నందిగామ పట్టణం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం విజయవాడ పార్లమెంట్ తెలుగు రైతు అనుబంధ విభాగాల కార్యవర్గ సమావేశం జరిగింది.  ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు  తంగిరాల సౌమ్య, , పార్లమెంట్ రైతు అధ్యక్షులు చెరుకూరు రాజేశ్వరరావు, రైతు నాయకులు,తెదేపా నాయకులు,కార్యకర్తలు హజరయ్యారు.
దేవినేని మాట్లాడుతూ వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది.. ఈ దుస్థితికి జగన్ రెడ్డి బాధ్యత వహించాలి. రైతుకు సకాలంలో నీటిని అందించక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, పంట కొనే నాథుడు లేక, కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు చెల్లించకుండా సర్కార్ రైతులను ఇబ్బందులకు గురి చేసింది. ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ యంత్ర పరికరాల సబ్సిడీకి మంగళం  పాడి, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడలకు బిగించారు. బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు తో సహా మేము చెప్పిన చోట సంతకం పెట్టకపోతే మీకు ఇచ్చే ఉచిత విద్యుత్ ఎత్తేస్తామని ప్రభుత్వం రైతులను బెదిరిస్తోందని అన్నారు.
సున్నా వడ్డీకి మంగళం పాడారు..మోటార్ లకు మీటర్లు, సన్నా వడ్డీ కూడా గ్యాస్ బండ సబ్సిడీ మాదిరే అవుతాయి. సుబాబుల్ టన్నుకు 5వేలు ఇస్తానన్న జగన్ నేడు ఎంత ఇస్తున్నారో చెప్పాలి ? రైతుకు వెయ్యి రూపాయలు కూడా దక్కడంలేదు!  రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల టర్నోవర్ పై జగన్ కమీషన్ వ్యాపారానికి తెరలేపాడు... రైతుభరోసా కేంద్రాలు వైసీపీ నాయకుల దోపిడీకి అడ్డాలుగా మారాయి. వైసీపీ హయాంలో 2552 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు..రైతులు చైతన్య వంతమై ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు చరమగీతం పాడాలని అన్నారు.

Related Posts