YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జీవనదీజలాలే ఆరోగ్యానికి శ్రేష్టం : మంత్రి జగదీష్ రెడ్డి

జీవనదీజలాలే ఆరోగ్యానికి శ్రేష్టం : మంత్రి జగదీష్ రెడ్డి

మేడిగడ్డ తో తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.. సూర్యాపేట జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యమవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా సూర్యపేట నియోజకవర్గం పెన్ పహడ్ మండల పరిధిలోని గాజులమొలకాపురం, సింగిరెడ్డిపాలెం గ్రామాలలో జరిగిన రైతు బంధు పధకం సభలో అయన పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ ఎస్ ఆర్.యస్.పికి భూసేకరణ జరిగింది తెరాస  ప్రభుత్వం లోనే అని గుర్తు చేసారు.   సముద్రంలో కలిసే నీటితోటే మేడిగడ్డ ప్రాజెక్టు అని అయన అన్నారు. అదే రేపటి తెలంగాణాకు జీవగడ్డ. అటువంటి ప్రాజెక్టుకు కాంగ్రెస్ అడ్డుపుల్లలు వేస్తోంది. రానే రాదనుకున్న తెలంగాణాను సాధించిన యోధుడు ముఖ్యమంత్రి కేసిఆర్  అని అయన అన్నారు. అప్పులేకుండా రైతు వ్యవసాయం సాగాలన్నదే సియం కేసీఆర్ లక్ష్యం . అనారోగ్యంతో ఆసుపత్రులకు తెలంగాణా ప్రజలు ఖర్చు చేస్తన్నది 40 వేల కోట్లు. అందుకు కారణం కలుషితమైన నీటి వాడకం వల్లనే అని అయన అన్నారు. చేలిమేల నీరు చేతి కందకుండా పోయింది. ఆ బారినుండి బయటపడేసేందుకే మిషన్ భగీరధ  అని మంత్రి అన్నారు. జీవనదీజలాలే ఆరోగ్యానికి శ్రేష్టం.కృష్ణా, గోదావరి నదుల జలాలను నేరుగా ప్రజలకు అందించాలన్నదే భగీరధ లక్ష్యమని మంత్రి వివరించారు. 

Related Posts