న్యూఢిల్లీ, జూన్ 11,
రాజ్యసభ ఎన్నికలు శుక్రవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ సహా విపక్షాల కూటమి పోటీపడ్డాయి. ప్రతిపక్షాలు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలలో గెలవగలిగే సీట్లను కోల్పోవడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ నుంచి అత్యంత ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఆప్ వంటి పార్టీలను సంప్రదిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అధికార ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థి గురించి చర్చించడానికి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఎన్డీఏకు పూర్తి ఆధిక్యత ఉన్న ఈ సమయంలో.. ప్రతిపక్ష పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉవ్విళ్లూరుతుండటం సరదాగా ఉందంటూ వ్యాసకర్త సందీపన్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన న్యూస్9కి రాసిన వ్యాసంలో పలు విషయాల గురించి ప్రస్తావించారు.ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొంటున్న ఓ పార్టీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు పూర్తి ఆధిక్యత ఉన్న చోట పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ రాజకీయాల్లో ఊహాజనిత ప్రపంచంలో కాకుండా.. ఆలోచిస్తున్నట్లయితే రాజ్యసభ ఎన్నికలతో అయినా రియాలిటీ చెక్‌కు రావాలి. ప్రతిపక్షాల ఐక్యత ఆలోచన ఒక ప్రహసనం. రాజ్యసభ సీట్లు గెలవడానికి ప్రతిపక్షాలు కూడా కలిసి రాలేకపోతే, రాష్ట్రపతి ఎన్నికలలో లేదా 2024 ఎన్నికలలో గెలుపొందాలనే ఆలోచన ఒక ఫాంటసీ.’’ అని సందీపన్ శర్మ పేర్కొన్నారు.రాజ్యసభ ఎన్నికల తాజా ఫలితాల్లో రాజకీయ లెక్కలు ఎలా ఉన్నాయో చెబుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, హర్యానా, రాజస్థాన్‌లలో బలం ఉన్న చోట విపక్షాలు పూర్తి ఆధిక్యతను కనబర్చలేకపోయాయి. ప్రతిపక్షం సరిగ్గా ఉంటే.. మరెన్నో మార్పులు చోటుచేసుకునేవి. రాజస్థాన్‌లో బీజేపీ కేవలం ఒకదానిని మాత్రమే గెలుచుకుంది. అశోక్ గెహ్లాట్ మూడు సీట్లను కైవసం చేసుకోవడంలో వ్యూహత్మక అడుగులు వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంలో ఓడిపోయాయి. కావున.. ఈ ఎన్నికల్లో బిజెపితో పోరాడటానికి బదులుగా, ప్రతిపక్షాలు ఒకరితో ఒకరు పోరాడుకోవడం కనిపించింది.మహారాష్ట్రలో, శివసేన తన రెండవ అభ్యర్థి విజయాన్ని ఖాతాలో వేసుకోలేకపోయింది. ఎందుకంటే దాని చిన్న మిత్రపక్షాలు కొన్ని బీజేపీకి ఓటు వేసాయి. కాంగ్రెస్, ఎన్‌సిపి మద్దతు ఉన్న శివసేన అభ్యర్థి ఓటమి, బీజేపీ ఎలాంటి ఎత్తుగడలనైనా ఎదుర్కోగలదనే అపోహను తొలగించింది. కూటమి ఎమ్మెల్యేల్లో ఇద్దరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. వారిని ఎన్నికల కోసం జైలు నుంచి విడుదల చేసేందుకు ప్రయత్నించలేదు. దీంతోపాటు మరోకటి అనర్హత వేటు వేయక పోవడం వల్ల ఇలా జరిగిందని చూపిస్తుంది.హర్యానాలో కాంగ్రెస్ తన సొంత ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ పార్టీకి ఓటు వేయలేదు. దీంతో అజయ్ మాకెన్.. ఓ స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారుమహారాష్ట్రలో ఓటమి ప్రతిపక్షానికి అతిపెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే ఇద్దరు పెద్ద నాయకులైన శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల సొంతగడ్డపై ఇలాంటి పరాభవం ఎదురుకావడం జీర్ణించుకోలేనిదిగా మారింది.ఏడాది కాలంగా ప్రతిపక్షాల ఐక్యతకు పవార్.. ఆధారంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నేతలతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో ఓటమి పవార్ తన రాష్ట్రంలో అజేయుడనే అపోహను పటాపంచలు చేస్తుంది. రాజ్యసభ ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా ఉద్భవించేలా చేశాయి. అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు కలిసివచ్చేలా చేశాయి.మహారాష్ట్ర ప్రభుత్వం, పవార్, శివసేన బలం మీద ఆధారపడి ఉంది. ఫలితాలు అవన్నీ అపోహలనే విషయాన్ని బట్టబయలు చేశాయి. థాకరే ప్రభుత్వ భవిష్యత్తుకు వ్యతిరేకంగానే కాకుండా ప్రతిపక్ష రాజకీయాలలో భీష్మ పితామహుడిగా ఉన్న పవార్ బలం కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందిప్రస్తుత పరిస్థితుల ఆధారంగా.. భారత రాజకీయాల దశ-దిశ గురించి అంచనా వేయవచ్చు. ఒకటి.. కాంగ్రెస్ విచ్ఛిన్నమవుతుందనీ, కూటమిలో గందరగోళం నెలకొందని స్పష్టమవుతోంది. హర్యానాలో, కాంగ్రెస్ తన ప్రత్యర్థి రణదీప్ సింగ్ సూర్జేవాలాను రాష్ట్రం నుంచి నామినేట్ చేయకుండా స్థానిక హెవీ వెయిట్ భూపేందర్ సింగ్ హుడాకు మొగ్గు చూపింది. ఇది బలహీనతను అంగీకరించడం.. హుడా శక్తిని అంచనావేయలేకపోవడం. అజయ్ మకాన్ ఓటమి, కుల్దీప్ బిష్ణోయ్ క్రాస్ ఓటింగ్ కారణంగా ఈ పరిస్థితి కనిపిస్తుంది.హైకమాండ్ ఆజ్ఞను గౌరవించని చోట కాంగ్రెస్ కుప్పకూలడంతోపాటు.. మరింత బలహీనంగా మారుతుంది. ఇది పార్టీ నిర్మాణం, నాయకత్వంలో మార్పులకు ఇది మరింత బలం చేకూరుస్తుంది. అంతర్గత విబేధాలు, అసమ్మతి, నిరుత్సాహం, నిస్పృహతో కూడిన ఈ వాతావరణంలో కాంగ్రెస్‌కు తనను తాను ప్రతిపక్షానికి ప్రధాన కేంద్రంగా చూపించుకోవడం ప్రస్తుతం కష్టం.కర్ణాటకలోని పవార్, ఠాక్రే, దేవెగౌడల ప్రభ కూడా తగ్గిపోయింది. ఇది వారి వారి పార్టీలలో స్వీయ సందేహం.. బలహీనమైన నైతికతకు దారి తీస్తుంది. అవహేళన చేయకుండా ఏకమైన ప్రతిపక్షం గురించి మాట్లాడే ధైర్యం, దృఢవిశ్వాసం ఇప్పుడు వారికి ఉండే అవకాశం లేదు.ముగింపు.. ఏంటంటే.. ప్రతిపక్ష శిబిరంలోని దాదాపు అందరూ ఓటమితో నిరుత్సాహానికి గురవుతారు. వారిలో విశ్వాసం కోల్పోవడం.. శక్తి తగ్గడం అనేది కేవలం ఓటమికి దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే సులభంగా విజయం సాధించగలదు.. 2024లో కూడా BJPని మరింత బలోపేతం కాగలదు అని కమలనాధులే పేర్కొంటున్నారు. మోడీకి వ్యతిరేకంగా మహాకూటమి (మహాఘటబంధన్) గురించి జరిగే అన్ని చర్చలు ఇప్పుడు జోక్ లాగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష శిబిరం రాష్ట్రపతి కావాలని కాంగ్రెస్ కోరుకోవడం.. కలలు కంటున్నట్లే కనిపిస్తుంది..