YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆత్మకూరులో ఏడుగురు మంత్రులా..

ఆత్మకూరులో ఏడుగురు మంత్రులా..

నెల్లూరు, జూన్ 13,
సిట్టింగ్ ఎమ్మెల్యే.. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గౌతంరెడ్డి చనిపోయారు. ఆయన సోదరుడు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలేవీ పోటీ చేయడం లేదు. కానీ.. వైసీపీ మాత్రం లేని పాముని అయినా పెద్ద కర్రతో కొట్టాలని నిర్ణయించుకుని ఏడుగురు మంత్రుల్ని పంపి బాదేస్తోంది. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఏడుగురు మంత్రులను ఇంచార్జులుగా నియమించారు. మేరుగ నాగార్జున, జోగి రమేష్, అంజాద్ బాషా, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్, నారాయణ స్వామి ఇన్చార్జులుగా మండలాల్లో ప్రచారం మొదలు పెట్టారు. మంత్రులే కాదు.. మంత్రులకు తోడుగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒక్కో మండలానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా పెట్టారు. అయితే వారంతా క్షేత్ర స్థాయిలోకి వెళ్లిన తర్వాత వైసీపీ హైకమాండ్ ఎందుకు ఇంత హడావుడి చేస్తుందో అర్థమవుతోంది. ఎక్కడ చూసినా వైసీపీ నేతల మధ్య సఖ్యత లేదు. ఒక్కో గ్రామంలో మూడు, నాలుగు గ్రూపులున్నాయి. గ్రూపులన్నీ కలసి పనిచేయాలని పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని చెప్పడానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఆ గ్రూపులు రకరకాల కోరికలు కోరుతున్నాయి. గ్రూపుల్లో ఎవరి రాజకీయాలు వారివే, ఎవరి నామినేటెడ్ పోస్టులు వారివే. పార్టీపై పెత్తనం ఒకరిదైతే, ఎంపీపీ మరొకరు. ఇలా ఎవరికి వారు తమ గ్రూపుల్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారందర్నీ కలిపే బాధ్యత ను వైసీపీ ఇంచార్జులు తీసుకున్నారు. మెజార్టీ లక్ష దాటాలని అధినాయకత్వం టార్గెట్ పెట్టింది. అందుకే ఇన్ ఛార్జ్ లుగా ఉన్న మంత్రులంతా హడావిడి పడుతున్నారు. తమ టాలెంట్ చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పోటీ లేని ఎన్నికలో ఈ హడావుడి మొదటికే మోసం తెస్తుందేమోనని కొంత మంది కంగారు పడుతున్నారు.

Related Posts