విజయవాడ, జూన్ 13,
ఇంటి గుట్టు గుట్టుగా వున్నంతవరకే, గుట్టు రచ్చకెక్కితే ఇంటి పరువు బజారుకెక్కుతుంది. రాజకీయాల్లో పరువుతో పాటు స్థానభ్రంశం కూడా జరగవచ్చు. ఇపుడు వైసీపీ పరిస్థితి ఇదే. జగన్ సారధ్యం ఆహా..ఓహా అనుకున్నారంతా. క్రమేపీ అసలు రంగు ఇపుడు బయటపడుతోంది. మొన్నటిదాకా అంతా చక్కగా నవ్వు తూ కలిసి పనిచేస్తున్నట్టు కేవలం కనిపించారనే అనాలి. ఇపుడు పరిస్థితులు అనుకూలించడమూ లేదు. పార్టీ విధానాలు, పథకాల అమలు అన్నింటా జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మంత్రులు, ఎమ్మెల్యే లు ప్రజల ముందు నిలిచి గట్టిగా ఏ పథకం గురించి మాట్లాడి నిలిచే స్థితిలో లేరు. దీనికి తోడు వారిలో వారికి అస్సలు పడటం లేదు. ఈ గొడవలు అంతకు ముందు నుంచీ వున్నా, ఇపుడు తెర మీదకి వస్తు న్నాయి. మంత్రులు, ఎమ్మల్యేలకు క్లాస్ తీసుకుందామని పెట్టిన ప్రత్యేక సమావేశంలో వారి మధ్య విభేదాలు బయట పడ్డాయి. అంతేకాదు అధిష్టానం మీద కూడా ఒంటికాలి మీద లేచేందుకు కూడా మం త్రులు, ఎమ్మెల్యేలు వెనుకాడలేదు. మీరు సరిగా చేయలేదంటే మీరు సరిగా లేరన్నారు. మొన్న మచిలీ పట్నం నియోజకవర్గం మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి మధ్య విభేదాలు బట్ట బయలయినాయి. ఇపుడు లేటెస్ట్‌గా గన్నవరం గొడవలు సీఎం జగన్ దాకా వెళ్లాయి. అక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర రావు మధ్య విభేదాలు రోడ్డెక్కాయి.వల్లభనేని వంశీ టిడిపీ నుంచి వైసీపీలోకి వచ్చినప్పటి నుంచి వీరిద్దరి మధ్యా విభేదాలు వుంటూనే వున్నా యి. అయితే అవి చుట్టుపక్కలవారికి తప్ప అధిష్టానం చెవికి చేరలేదు.నియోజకవర్గంలో అందరికీ చేదోడు వాదోడుగా వుంటున్న తనను వంశీ అప్రతిష్టపాలు చేస్తున్నారని వాపోయారు. వ్యక్తిగత పనులపై యార్లగడ్డ ఆరు నెలలు అమెరికా వెళ్లారు. ఆ సమయంలో తనపై దుష్ప్రచారం చేశారని యార్లగడ్డ ఆరో పణ. సీఎం జగన్ కెడిసిసి చైర్మన్ పదవిని యార్లగడ్డకు ఇచ్చారు. ఎంతో కష్టపడి, ఎన్నో సంస్కరణలు తెచ్చి 43 శాతం అభివృద్ధి చేసిన తనను జగన్ దృష్టిలో తక్కువ చేసేవిధంగా వ్యవహరించడం వంశీకే చెల్లిందన్నారు. అసలే అన్నివైపుల నుంచీ సమస్యలతో సతమతమవుతున్న జగన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఇలాంటి వివాదాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. విభేదాలు చర్చించుకుని ప్రభుత్వ పథ కాల ప్రచారంలో గట్టి కృషి చేయాలని జగన్ నెత్తినోరు కొట్టుకుంటున్నా పార్టీలో సీనియర్లు ఇలా గొడవ పడుతూండడం జగన్‌కు తలభారంగా మారింది.వంశీమోహన్ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని తాను ఎలాంటి విచారణకయినా సిద్ధమంటున్నారు యార్లగడ్డ వెంక్రటావు. మట్టి తవ్వడం డబ్బుచేసుకోవడం వంటి ఆరోపణలు అర్ధరహితం. తాను నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా వున్నపుడు ఒక్క పైసా అవినీతికి పాల్పడ లేదని, అవసరమయితే దేవుని వద్ద ప్రమాణం చేయడానికీ సిద్ధమని అన్నారు. అంటే నియోజక వర్గంలో వంశీ మోహన్, వెంకట్రావు మధ్య విభేదాలు ఏస్థాయికి చేరుకున్నదీ తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటి చేస్తారు. ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారని నా పై ఇంతమంది ప్రచారం చేస్తున్నారు కాబట్టే నా ఇమేజ్ బాగా పెరిగింది అనుకుంటున్నాని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.ఈ విభేదాలు, తగాదాలు, గొడవల నేపథ్యంలో వైసీపీలో కీలకవ్యక్తులను, అభిమానులను ఒకే తాటి మీద నడిపించడం బహుకష్టమే. ఎన్నికలు ఆట్టే దూరంలో లేని ఈ సమయంలో పార్టీ పటిష్టంగా వ్యూహాత్మ కంగా ముందడుగు వేయాల్సిందిపోయి తమ్ముళ్ల మధ్య తగాదాలు, అభిమానుల వీధిపోరాటాల పరిష్క రణ కార్యక్రమాలే జగన్ రెడ్డికి ప్రస్తుతం అత్యంత ప్రధాన కార్యక్రమమయింది.