న్యూఢిల్లీ జూన్ 13,
నచ్చితే ఎవరినైనా అభిమానించవచ్చు, ప్రేమించా వచ్చు. కానీ ప్రేమలో తలమునకలై తామేం చేస్తున్నావెూ తెలియనంతగా వుంటేనే ప్రమాదం. అదానీకి విండ్ పవర్ ప్రాజెక్టు ఇప్పించాలని మహా కోరిక. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టు ఇప్పించేయాలనుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటాబ్యా రాజపాక్సా మనోడే నా మాట వింటాడు అనే ధీమాతో మన ప్రధాని వెూదీజీ ఆయనతో సమావేశమయ్యారు.ఆ 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు పని మావాడికే వచ్చేట్టు చేయమని వెూదీజీ రాజపాక్సేపై వొత్తిడి తెచ్చారన్నది బయటపడింది. సంగతేంటంటే.. వెూదీ, రాజపాక్సే మాటల మధ్యలో ఈ ప్రాజెక్టుని అదానీకి ఇవ్వాలని కోరడంతో రాజపాక్సే ఆవేశంలో అంగీకరించారట. అలాగని సిలోన్ విద్యుత్ బోర్డు (సిఇబి) చైర్మన్ ఎం.ఎం.సి. ఫెర్నాండో అనడం విచిత్రం. అదెలా జరుగుతుంది వెూదీకి రాజపాక్సే హామీ ఇవ్వడం రెండు ప్రభుత్వాల మధ్య స్నేహబంధానికి ప్రతీకగా పేర్కొన్నారు. కానీ ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారిక కార్యకలాపాలు గమనిస్తున్నవారు మాత్రం ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించారు. ఆనక రాజపాక్సే కూడా అసలా ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కి గాని మరే సంస్థ, వ్యక్తులకు గానీ ఇచ్చేది లేదని తేల్చారు. గతేడాది నవంబర్‌లో శ్రీలంక అధ్యక్షుడు తనను పిలిచి ఈ 500 మెగావాట్ల ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కి ఇవ్వమని భారత ప్రధాని వెూదీజీ తనను బలవంతం చేసేరని చెప్పడం తాలూకు వీడియో క్లిప్పింగ్ అక్కడి ఛానల్స్ ప్రసారం చేశాయి.ఇది ప్రభుత్వాల మధ్య ఒప్పందాలే అయినప్పటికీ చర్యలు మాత్రం చట్టంలో పేర్కొన్న కాస్ట్ పాలసీ అను సరించే జరుగుతాయని సిలోన్ విద్యుత్ బోర్డు ఏర్పాటు చేసిన పేనల్ చైర్మన్ చరితా హెరాత్ అన్నారు. దీనికి సంబంధించి ఆ మర్నాడే కమిటీ సమావేశంలో విండ్‌పవర్ ప్రాజెక్టును ఇవ్వడం జరగదని రాజపాక్సే పేర్కొనడాన్ని సిఇబి చైర్మన్ వివరిస్తూ శనివారం ట్వీట్ చేశారు.ఇంతకీ ఈ మొత్తం తెలియ జేసేది.. వెూదీగారి అదానీ ప్రేమాయణం. దేశ పారిశ్రామికవేత్తల్లో ఆయనకు మరెవరూ కనిపించలేదు. ఆ ప్రాజెక్టు మరెవరూ చేపట్టలేరన్న నమ్మకమా, మనది మనది బరంపురమన్న సామెతను అక్షరాలే అమలుచేయాలన్న తపనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో స్నేహం వుండవచ్చు. వారి అభిమానాన్ని పొందగలిగే సత్తా వుండవచ్చునేవెూ అలాగని అన్నీ వారికే అంటగట్టాలని అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా వారి పట్ల అతి ప్రేమను ప్రదర్శించాలా ఎందుకు అవసర సమయాల్లో ఆదుకున్నారా గెలిపించి పీఠం ఎక్కించారనా