YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ముగ్గురు ఎంపీలు మార్పు తప్పదా

ఆ ముగ్గురు ఎంపీలు మార్పు తప్పదా

గుంటూరు, జూన్ 14,
నలుగురితో ఎప్పుడూ బాగుండాలి, అందరినీ సమానంగా చూడాలి, మంచివాళ్లని అనిపించుకోవాలి. మంచిగా ప్రవర్తించాలి.. ఇవి అనాదిగా పెద్దవాళ్లు చెబుతున్న సూక్తులు. విని వాటి సారాంశం ఆకళింపు చేసుకోవాలి. లేకుంటే అప్రతిష్ట పాలవడం ఖాయం. ఇపుడు జగన్‌ సర్కార్‌ది ఇదే పరిస్థితి. కొన్ని విషయాలు పరిశీలించి పట్టించుకోవాలి. ఈ రెండూ నిర్లక్ష్యం చేసి సమస్యలు కొని తెచ్చుకున్న నేత వైసీపి అధినేత  జగన్‌ రెడ్డి. అధికారంలోకి రావాలని తాపత్రయపడి, తీరా వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పార్టీ వర్గాల్లో సమస్యలు తలెత్తకా పోవు, క్రమేపీ మంత్రులు, ఎమ్మెల్యేలకూ ప్రాణం విసిగెత్తకా పోదు. మరి అదే జరిగింది. మూడేళ్ల పాలన తర్వాత తరచి చూసుకుంటే పార్టీ వర్గాల్లో సఖ్యతా లోపం, నాయకుని మాటకే విలువ లేకపోవడం, జంపింగ్‌ జిలానీలుగా మారడానికి ఏమాత్రం వెనుకాడకపోవడం. అన్నీ జరిగిపోతున్నాయి. ఏపీలో ముగ్గురు ఎంపీలు వైసీపిలో ఏమాత్రం కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదన్నది తేట తెల్లమయింది. వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో నిత్యం చిన్నపిల్లల్లా గొడవలు పడుతున్నారు. వారి మధ్య ఏమాత్రం స్నేహపూర్వక వాతావరణం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ నిలదొక్కుకునే స్థాయి క్రమేపీ కోల్పోతోంది. మూడేళ్లలో ఎన్నికలు జరగనుండగా పార్టీలోని సీనియర్లలోనూ ప్రశాంతత కరువయింది. దీనికి తోడు వచ్చే ఎన్నికలకు పొత్తులకు అవకాశం వుందని తెలుగు దేశం అనడంతో వైసీపీ ఎంపీలు కొంత ఆకర్షితులయ్యారనే చెప్పాలి. ఉత్తరాంధ్రలో నరసాపురం నియోజకవర్గం తీసుకుందాం. ఇక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కనిపించరు. ఇప్పుడు కాదు రెండేళ్లుగా అసలు నియోజకవర్గానికే ఆయన దూరంగా వున్నారు. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతునిస్తుండటం గమనార్హం. ఆయనకు పార్టీ నాయకునికి మధ్య విభేదాలు ఆఖరికి ఆయన తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారేవెూనన్న అనుమానాలకి దారితీస్తోంది. రెబెల్‌ స్టార్‌గా రాజకీయాల్లో ప్రసిద్ధి పొందడంతో ఆయన్ను పార్టీ నుంచి తొలగించాలనుకున్నారు జగన్‌. కానీ ఆయనపై అనర్హత వేటు వేయడానికి సాంకేతిక ఇబ్బందులు అడ్డు పడ్డాయి. పార్టీలో వున్నట్టేనా అంటే వున్నట్టే, మీవాడేగా అంటే మావాడే కాని కాడు.. అనే రీతిలో రెండేళ్లుగా వైసీపీలో రఘురామరాజు ప్రయాణం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపీ టికెట్‌ మీదనే తన నరసాపురం నియోజకవర్గం నుంచే పోటీచేసినా పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వారి ఎంపీ లావు కృష్ణదేవరాయలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. పాపం ఆయన మాత్రం అందరితో కలిసి పనిచేయాలన్న మనసున్న వ్యక్తే. ఎమ్మెల్యేలే ఆయన్ను దూరంగా పెట్టేరు. మరీ ముఖ్యంగా విడదల రజని(చిలకలూరిపేట), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ)తో ఆయనకు తరచూ ఏదో విధంగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటీ అంటనట్టే వ్యవహరిస్తున్నారు. అంతెందుకు ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు, నరసరావు పేటలో జరిగిన బహిరంగ సభకు ఎంపీ లావు దూరంగానే వున్నారు. పార్టీ అధిష్టానానికి ఎంత గోడు పెట్టుకున్నా చెవిటివాడి ముందు శంఖం పూరించినట్టే అయింది. విసిగెత్తింది. మనసు విరిగింది. పార్టీ మారతారన్న ప్రచారం కూడా జోరందుకుంది. మారినా ఆశ్చర్యపడగనక్కర్లేదు.ఇక ఇటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయానికి వస్తే, అసలు ఎంపీగా ఎన్నికయినప్పటి నుంచే ఆయన అసంతృప్తిగానే వున్నారు. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదనే ఆయన వైసీపీలోకి వచ్చేరు. ఇక్కడ ఆయనకు లాభం కంటే నష్టమే జరిగిందన్న భావనతో కుంగిపోతున్నారు. దేశ వ్యాప్తంగా పేరున్న తమ మ్యాకడోవెల్స్‌ వైన్‌ అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం మీద కాస్తంత కినుక వహించేరు. పక్క రాస్ట్రాలు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందిపెట్టడం లేదన్న అభిప్రాయం నాటుకుంది. దీనికి తోడు స్థానికంగా బాలినేని ఆధిపత్యం చలాయిం చడం పెరిగింది. దీంతో తనకు అంతకు ముందున్న పట్టు పోయిందని ఇబ్బందిపడుతున్నట్టు అనుచరులే అంటు న్నారు. ప్రోటోకాల్‌ సమస్య ఇంతగా ఇబ్బందిపెడుతుందా, ఏవెూగానీ మాగుంట మాత్రం వచ్చే ఎన్నికల సమ యానికి పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా వున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
మూడేళ్లకే డీలాపడ్డ జగన్‌ని వచ్చే ఎన్నికల నాటికి ఎవరు, ఎలా ధైర్యం ఇచ్చి నిలబెట్టగలరు స్వపార్టీవారే పక్క చూపులు చూస్తుంటే పార్టీ అధినేత  చేసేదేముంటుంది. వచ్చే ఎన్నికల సమయానికి టిడిపి పంచన చేరేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందన్నది పరిశీలకుల మాట. అదెలా వున్నా, తాను వూహించనది జరిగి తీరాలన్న పట్టుదల, తన మాటే వినాలన్న మొండితనమే వైసీపీ కోటను బద్దలుకొట్టగలదు.

Related Posts