లక్నో, జూన్ 14,
వైరం, విరోధం వుండవచ్చునేమోగాని, మతపరమైన వైరం విరోధం రక్తంలోకి ఎక్కంచుకోకూడదు. ఇది మహా ప్రమాదం. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వైరం ఏదో విధంగా వ్యక్తం చేయడం గమని స్తూనే వున్నాం. ఇటీవల మహమ్మద్ ప్రవక్త మీద బిజెపి అధికార ప్రతినిధి నుపూర్ చేసిన అనుచిత వ్యాఖ్య లతో ఆమెను పదవి నుంచి తొలగించేరు,పార్టీకి దూరం చేసేరు. అంతటితో ప్రభుత్వం, బిజెపీ ప్రముఖులు చేతులు దులిపేసుకున్నారు. కానీ దాని పర్యావసానం అంతు లేకుండా కొనసాగుతోంది. దేశంలో పలు ప్రాం తాల్లో ఇంకా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అల్లర్లు, కొట్లాటలు కొనసాగుతూనే వున్నాయి. వాటిలో పాల్గొన్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోమని పోలీసులను ఉసి గొల్పడం కూడా జరు గుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో ఈ తరహా పరిస్థితులు అధికంగా ఉన్నాయి. అసలు బీజేపీ కార్యకలాపాలే మోదీ ప్రభుత్వ వ్యతిరేకుల మీద దాడులు జరగలా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం తప్పు ఎలా అవుతుంది. తాము చేపట్టిన పథకాలు, కార్య క్రమాలను విమర్శించవద్దని ఎలా అంటారు. పైగా బుల్‌డోజర్లను వినూత్నంగా ఉపయోగించడం బిజెపి ప్రభుత్వం లోనే చూస్తున్నాం. బుల్‌డోజర్లను ఇళ్లను కూల్చివేయడానికి చాలా ఈజీగా నడిపిం చేయడం బిజెపీ వర్గీ యులకు, వీరాభిమానులకు చాలా సరదాగా, గొప్ప ఎంటర్‌టైన్మంట్ గా మారింది. నూపుర్ వ్యాఖ్యల అనం తరం జరుగుతున్న అల్లర్లు, కొట్లాటల్లో చురుగ్గా పాల్గొన్నవారి ఇళ్ల మీదకి బుల్ డోజర్లు నడిపించేయడం జరిగింది. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లో జావెద్ అనే వ్యక్తి ఇల్లు కూల్చివేయడం జరిగింది.అలాంటి వారికి ఈ గతే పడుతుందని బెంగుళూరు బిజెపీ నాయకుడు రవి చెప్పా రు. బుల్‌డోజర్లతో, బుల్లెట్లతోనే వారికి బుద్ధి వస్తుందని రవి ఆరోపించడం బిజెపి పాలన తీరు, మతపిచ్చిని స్పష్టం చేస్తుంది. నూపుర్ వ్యాఖ్యలకు కేవలం ఆమెను పదవి నుంచి తొలగించి, పార్టీకి దూరం చేయ డంతోనే సమస్య సద్దుమణుగుతుందని ఎలా అనుకుంటారన్నదిదేశంలో ముస్లింల ప్రశ్న. దీనికి తగిన సమాధానం ఇచ్చి వారి మనోభావాలు దెబ్బతినకుండా భవిష్యత్తులో జాగ్రత్తపడతామన్న దోరణి కూడా కేంద్రం వ్యక్తం చేయకపోవడమే చిత్రం. పైగా బిజెపీ పార్టీ నాయకులు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అల్లర్లకు దిగినవారిని వూరికే వదిలిపెట్టబోమని, కేసులు బనాయించడం, బుల్‌డోజర్లతో వారి ఇళ్లను ధ్వం సం చేసి వారికి బతుకు కష్టం చేకూరుస్తామన్న ధోరణిలోనే వుండడం, హెచ్చరించడం మంచి పాలన అనిపించుకుంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్న.