న్యూఢిల్లీ జూన్ 14
భారతీయ యువత కోసం రక్షణశాఖ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. క్యాబినెట్ కమిటీ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అగ్నిపథ్ స్కీమ్ కింద దేశంలోని యువతను రక్షణ దళంలోకి తీసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఆర్మీలో యువతను నింపాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నారు. కొత్త టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సైన్యంలో చేరే యువత ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా శిక్షణ ఇస్తారు.అగ్నిపథ్ స్కీమ్ కింద సైన్యంలోకి సుమారు 45వేల మందిని రిక్రూట్ చేయనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. అయితే నాలుగేళ్ల పాటు యువత సర్వీసులో ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్ల సర్వీస్‌లో ఉంటారు. మిగితా వాళ్లకు 12 లక్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్లకు పెన్షన్ బెనిఫిట్ ఉండదు.