YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్ ఉచిత పంటల బీమా ప్రారంభించిన సీఎం జగన్

వైఎస్సార్ ఉచిత పంటల బీమా ప్రారంభించిన సీఎం జగన్

శ్రీసత్యసాయి
సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో వైయస్ఆర్ ఉచిత పంటల బీమా కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. పంటల బీమా కింద 44.28 లక్షల మంది రైతులకు రూ.6684.84 కోట్లు. ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్ఫుట్ సబ్సిడీ. మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.25,800 కోట్లు ఖర్చు అవుతోందని అన్నారు.
రైతులకు మేలు చేయడంలో ప్రతిపక్షాలతో కాదు..దేశంతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని చెప్పారు. మూడేళ్లలో రైతన్నల కోసం లక్షా 28 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సగర్వంగా చెప్పారు.  ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించారు. 2021 ఖరీఫ్లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.
దేవుడి దయతో ఈ రోజు ఇక్కడ కొత్త జిల్లా స్థాపించిన తరువాత సత్యసాయిబాబా జిల్లాగా పేరు పెట్టి ఇక్కడికి రావడం..2978 కోట్ల మేరకు అక్షరాల రూ.15.60 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది.  ఇంతకు ముందు నానుడి ఉండేది. రాయలసీమ అంటే కరువు సీమ అని..అనంతపురం జిల్లాను ఏకంగా ఎడారి జిల్లా అనేవారు. కానీ ఈ రోజు దేవుడి దయవల్ల అలాంటి వాతావరణం మారిపోయింది. దారాళంగా గంగమ్మ పైకి లేచినట్లుగా ఈ రోజు నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. రిజర్వాయర్లు దేవుడి దయతో నిండాయి. దేవుడి దయతో చెరువులు నిండాయి. గంగమ్మ తల్లి మనందరికీ కూడా కనిపిస్తోంది.
ఈ రోజు ఇక్కడ రూ.2900 కోట్లు బీమా పరిహారంగా 15.60 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టాం. ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇన్సూరెన్స్ కింద వస్తున్న సొమ్ము అక్షరాల రూ.880 వేల కోట్లు అందుతున్నాయి. అప్పట్లో నాన్నగారి హాయంలో 800 కోట్లు ఇవ్వడం చూశామని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అంతకుమించి ఈ రోజు మీరు ఇస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఒక్కసారి మార్పును గమనించండని అన్నారు.
జూన్ మాసంలో వ్యవసాయం పండుగగా మారే మాసం. ఆ నెల రాకముందే వ్యవసాయ పనులకు తోడుగా నిలబడేందుకు రైతు భరోసా సొమ్ము రూ.7500 ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు.
ప్రభుత్వం ఒక వైపు నవరత్నాలు పథకాల ద్వారా తోడుగా ఉంటునే మరో వైపు వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు ఆత్మహత్యలు చేసుకుంటే అవి ఆత్మహత్యలు కాదని గత ప్రభుత్వం చెప్పేది. ఈ రోజు ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి పక్కాగా ఆదుకునే కార్యక్రమం జరుగుతోంది. కౌలు రైతులు సీసీఆర్సీ కార్డుఉంటే వెంటనే ప్రభుత్వం ఆదుకుంటుంది. రూ.7 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామని అన్నారు. గతంలో ఇది ఎందుకు జరగలేదు? అప్పుడు నేరుగా గత పాలకుల జేబుల్లోకి డబ్బులు పోయేవి. గతంలో జరగనిది.. ఇప్పుడు మీ బిడ్డ పాలనలో జరుగుతుంది. గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు. మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేదని మనం చూశాం. అలాంటి వాళ్లు రాజకీయాలకు తగునా? ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడు.. ఎలా మోసం చేశాడో మీరు చూశారు. ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందని.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసి.. తోడుదొంగలైన వీరిద్దరు... రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు.
మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే... దాన్ని డైవర్ట్ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. వీళ్లంతా ఏకం అవుతారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా .. అబద్ధానికి రంగులు పూస్తారు. చంద్రబాబుగారు వచ్చినా, దత్తపుత్రుడు వచ్చినా అడగండి. మీరిచ్చిన మేనిఫెప్టోను చూసి ఓట్లేశాం.. ఆమేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని అడగండి. మేనిఫెస్టోలో రైతుకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయని ఈ చంద్రబాబు మంచోడంట. రుణమాఫీ అంటూ మోసం చేసి రైతులను నట్టేట ముంచి ఈ చంద్రబాబు మంచోడంట. ఉచిత విద్యుత్, ధాన్యం, విత్తన బకాయిలను, పంటల బీమాకూడా చెల్లించకుండా బకాయిలు పెట్టి ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు మంచోడంట. మూడేళ్ల పాలన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం అమలు చేశామని, ఆ మేనిఫెస్టోను చూపించి మీరే టిక్ పెట్టండి అని మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆశీస్సులను మీ బిడ్డ అడుగుతున్నాడని అన్నారు.
ఇద్దరికీ తేడాను గమనించండి. కోనసీమలో క్రాప్ హాలిడే అని రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను జగన్ అనే నేను తీర్చినందుకా? కేంద్రం నుంచి సకాలానికే డబ్బు రాకపోయిన 21 రోజుల్లోనే వారికి ధాన్యం డబ్బులు ఇవ్వడంకోసం కిందా మీదా ప్రయాస పడుతున్న మీ బిడ్డ ప్రయత్నాన్ని చూడలేకపోతున్నారా? అంటూ ఇదే చంద్రబాబును, మీ దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ని అడుగుతున్నాను. 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత టెన్త్పరీక్షలు జరిగాయి. పరీక్షలు లేకుండా పాస్చేసుకుంటూ రెండేళ్లు వచ్చాం. 67శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. గుజరాత్లో 65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించే మాటలు చెప్పాలి. సప్లిమెంటరీ తీసేసి.. రెగ్యులర్గానే వారిని భావిస్తూ వారికి మళ్లీ పరీక్షలు పెడుతున్నామని అన్నారు.
ఆ పిల్లలను సైతం రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సింది క్వాలిటీ చదువులు . ప్రపంచంతో పోటీపడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యారంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయంచేస్తున్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అనే మహానుభావుడి పేరును పెట్టాం. ఒక దళిత మంత్రి, బీసీ మంత్రి ఇళ్లను కాల్చేశారు. ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరుపెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదా మీరు చూపించే సామాజిక న్యాయం? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? మీ బిడ్డ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారని అన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే ధోరణి. ఉద్యోగులకు ప్రతి విషయంలో మంచి చేస్తున్నాం. ఇంతకు ముందు ఎవ్వరూ కూడా సాహసం చేయలేదని అన్నారు.
వారికి మంచి జరుగుతుందని నచ్చజెప్పి, వారిని కలుపుకుంటూ పోతే.. వారినికూడా రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. మీ బిడ్డ ఎదుర్కోగలడు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Related Posts