విశాఖపట్నం
విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్ లో ఈ నెల 7న ఓ యువతిపై ఓ చానల్ రిపోర్టర్ నంటూ అత్యాచారం జరిపి, ఆమె నుంచి బంగారం, నగదు కాజేసిన వంకా కుమార్ ను పోలీసు లు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన రౌడీ షీటర్ గర్భాపు శేఖర్ ను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి ఛానల్ లోగో, మైకు, గుర్తింపు కార్డులు, బంగారం ఉంగరం, రెండువేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఏ విధంగా అదుపులోకి తీసుకున్నది, ఏ సి పి పెంటారావు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. వివిధ రకాల నకిలీ అవతారాలెత్తి మహిళలను మోసం చేసి, లక్షలాది రూపాయలు కాజే యటంలో కుమార్ సిద్ధహస్తుడని తెలిపారు. మరో రౌడీషీటర్ శేఖర్ మీద కూడా హత్య , హత్యా యత్నం కేసు లు నమోదైనట్టు చెప్పారు.