న్యూఢిల్లీ జూన్ 14
రాబోయే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. పీఎంవో ఆఫీసు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. అన్ని శాఖలు, మంత్రాలయాలకు సంబంధించిన మానవ వనరులను ప్రధాని మోదీ సమీక్షించారని, రాబోయే 1.5 ఏళ్లలో ఓ యజ్ఞం తరహాలో 10 లక్షల ఉద్యోగాలను రిక్రూట్ చేయాలని ఆ ట్వీట్‌లో తెలిపారు. 10 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 2023ను డెడ్‌లైన్‌గా ఫిక్స్ చేశారు. 18 నెలల్లోనే రిక్రూట్మెంట్లు పూర్తి కావాలన్నారు. నేషనల్ స్టాటిస్‌టికల్ ఆఫీసు నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగుల డేటాను సేకరించినట్లు కార్మిక శాఖ తెలిపింది.