YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడలో నాని వర్సెస్ చిన్ని

బెజవాడలో నాని వర్సెస్ చిన్ని

విజయవాడ, జూన్ 15,
కేశినేని నాని కేంద్రంగా బెజవాడ టీడీపీ రాజకీయం మరోసారి వేడెక్కుతోందా? కొత్తగా కేశినేని వర్సెస్‌ కేశినేని అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఎందుకలా? విజయవాడ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ ఎపిసోడ్‌లో మరోవర్గం ఎలాంటి పాత్ర పోషిస్తోంది?బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్‌ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా, బోండా ఉమ వంటి వారు రాజకీయం చేసేవారు. బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత ఒకట్రోండు సందర్భాల్లోనూ గొడవలు బహిర్గతమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి.. కేశినేని నాని పార్టీ అధినాయకత్వంతో సఖ్యతగా ఉండడం మొదలు పెట్టారు. అయితే బెజవాడ టీడీపీలో సీన్‌ మళ్లీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోందట. పార్టీ అధిష్ఠానానికి.. కేశినేని నానికి మధ్య గ్యాప్‌ పెరిగినట్టు చెబుతున్నారు. అయితే ఈసారి కారణం వేరేవరో కాదు.. స్వయంగా కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని. ఇప్పటి వరకు బెజవాడ రాజకీయాల్లో చిన్ని అంతగా వినిపించ లేదు. కానీ ఇటీవల కాలంలో పెద్దగానే టీడీపీ చర్చల్లో నలుగుతోంది చిన్ని పేరు.వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని కాకుండా.. కేశినేని చిన్ని పోటీకి దిగుతారనే ప్రచారం మొదలైంది. ఇది నానికి మంటపుట్టిస్తోందట. ఆ మధ్య చంద్రబాబును.. లోకేషును చిన్ని కలిసి మాట్లాడారట. ఆ తర్వాత నుంచి బెజవాడ టీడీపీ రాజకీయాల్లో.. కేశినేని వర్సెస్‌ కేశినేని అన్నట్టుగా సీన్‌ మారినట్టు చెబుతున్నారు. ఇటీవల కేశినేని చిన్ని ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి నానికి అనుంగు అనుచరులనుకున్న ఒకరిద్దరు వెళ్లారు. అలా వెళ్లిన వారిని కేశినేని నాని తన వద్దకు రానీయడం లేదట. దూరంగా పెట్టేశారట. చిన్ని మాత్రం అన్నతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేపట్టడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. .మహానాడు సందర్భంగా కేశినేని చిన్ని వేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా నాని ఫొటో లేదు. పైగా ఒక ప్రమోషనల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్‌ చేస్తోంది చిన్నవర్గం.తనను కాదని.. చిన్నిని టీడీపీ పెద్దలు ఎంకరైజ్‌ చేస్తున్నారనే ఫీలింగ్‌లో నాని ఉన్నారట. ఈ ప్రచారాన్ని నాని ప్రత్యర్థులు అడ్వాంటేజ్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపికి.. కేశినేని నానికి మరింత గ్యాప్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారట. చీటికీ మాటికీ అధిష్ఠానం మీద అలిగి.. తాను పోటీ చేయబోనని నాని చెబుతుంటే.. ప్రత్యామ్నాయాలు చూసుకోవద్దా..? అందుకే చిన్నిని ఎంకరేజ్‌ చేస్తున్నారనే ప్రచారం మొదలు పెట్టారట. ఇందులో నిజమెంతో ఏమో.. నాని తీరు మాత్రం ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీ కీలకపాత్ర పోషించేవారిలో కొందరు నాని గురించి.. అతని తీరుపైనా ఉన్నవీ లేనివీ చంద్రబాబుకు.. లోకేషుకు నూరిపోస్తున్నట్టు తెలుస్తోంది.అయితే పార్టీ పెద్దలు నానిని దూరం చేసుకోవడం ఇష్టం లేదనే సంకేతాలిస్తూనే ఉన్నారట. కాకపోతే పార్టీ హైకమాండ్‌లో వచ్చిన గ్యాప్‌ను తగ్గించుకోవడానికి కేశినేని నాని చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారట. మరి.. రానున్న రోజుల్లో బెజవాడ టీడీపీ రాజకీయాలు కేశినేని వర్సెస్‌ కేశినేని అని సాగుతాయో.. లేక మరో మలుపు తీసుకుంటాయో చూడాలి.

Related Posts