ముంబై, జూన్ 15,
కోవిడ్ భూతం పట్టుకుని పీడించినంత కాలం అతి జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాలకు, మందుల తయారీ కంపె నీలకు ఇప్పుడు అతిగా మిగిలిపోయిన వాక్సిన్ మందులతో ఏమీ చేయాలో తోచడం లేదు. మొదటి వేవ్ సందర్భంలో అందరం కంగారు పడ్డాం. రెండవ వేవ్ సమయానికి వాక్సిన్ వేయించుకోవడం లో ప్రజలు ఎంతో ఆసక్తి చూపారు. మందుల కంపెనీలు అందుకు అవసరమయిన వాక్సిన్ డోసులు భారీ ఎత్తున ఉత్ప త్తి చేసి అందుబాటులో వుంచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చకచకా వాక్సినేషన్ ఎంత అవరమన్నది ప్రచారం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాయి. ఆరోగ్యశాఖ, ఆస్పత్రులూ, డాక్టర్లూ ఎంతో అద్బుతంగా సేవలు అందించి అందరినీ ఆదుకున్నారు. ఇంతవరకూ బాగానే వుంది. ఆ తర్వాత అందరికీ కోవిడ్ భయం పోయి ప్రశాంతంగా బతకవచ్చు అనే ధైర్యం వచ్చేసింది. కానీ డాక్టర్లు మాత్రం ఇంకొన్నాళ్లు జాగ్రత్త గానే వుండాలన్న హెచ్చరికలను ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. మాస్క్ కూడా తీసి పడేసి జనాలు తిరిగేస్తున్నారు. నాలుగో వేవ్ మాటలు జనా లకు పట్టే స్థితి లేదు. ఇప్పటికే చాలా కాలం వుద్యోగాలకు, పనులకు దూరమయి ఆర్ధికంగా కుదేలవుతున్న కుటుంబాలు, సంస్థలూ అన్నీ అందరూ కూడా మొన్నటి దాకా తీసుకున్న రెండు డోసుల బలం వుండనే వుంది ఇక ఏదీ తమకు ప్రాణహాని కలిగిం చదనే ధైర్యంతో బయటకి రావడం, పనులు చేసుకోవ డం జరుగుతోంది.కానీ ముందస్తు జాగ్రత్తగానో, మూడో విడతకు అందుబాటులో వుండాలన్న జాగ్రత్తతోనో కోవీషీల్డ్, కోవాక్సి న్లు కంపెనీలు పెద్ద సంఖ్యలోనే ఉత్పత్తులు చేసి జాగ్రత్తపరిచాయి.కానీ వాటి లైఫ్ టైమ్ ముగిసిపోయిం ది. వాటిని అర్జంట్‌గా ఉపయోగించే అవసరం ఇపుడు అంతగా లేదు. అయినా ప్రజలు ప్రికాషనరీ డోస్ వేసుకోవడదానికి ఇక ఆసక్తీ చూపడం లేదు. అయితే గతేడాది చివర్లో ఉత్పత్తి చేసి భద్రపరిచినవి భారం గానే మారాయి. ఎందుకంటే, వాటి ఎక్స్‌పైరీ డేట్ అయిపో యింది. దాన్ని మరికొంతకాలం పొడగించే వీలుందే మో చూడమని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అది ఎంతవరకూ సాధ్యమన్నది ఆయా కంపెనీ లు, సంస్థలు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఇలా వ్యర్థంగా పారబోసే బదులు అందరికీ బూస్టర్ డోస్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయవచ్చు కదా అని పరిశీలకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బూస్టర్ డోస్ ను సీనియర్ సిటిజన్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మిగిలిన వారంతా ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి ఉంది