డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో ప్రవేశాలకై నిర్వహించే డీసెట్ పరీక్షకు మొత్తం 52,935 మంది హాజరైనట్లు డీసెట్ కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. మొత్తం 62,909 మంది ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేయగా.. 52,935 మంది హాజరైయ్యారని అన్నారు. డీసెట్ పరీక్షలను 17, 18 తేదీల్లో నిర్వహించామన్నారు.. డీసెట్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్ హించామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని అన్నారు. మ్యాథ్ మేటిక్స్ కు 20,024 మంది, సోషియల్ స్టడీస్ కు 14,317 మంది, ఫిజికల్ సైన్సెస్ కు 6096, బయోలాజికల్ సైన్సెస్ కు 12,498 మంది విద్యార్థులు హాజరైనట్లు డీసెట్ కన్వీనర్ పార్వతి స్పష్టం చేశారు. ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.