గవర్నర్ కు రాజీనామాను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈసారి కూడా యడ్డీకి అదృష్టం దక్కలేదనే చెప్పుకోవాలి. కేవలం రెండు రోజులకే ఆయన సీఎం పదవి ముగిసింది. బలపరీక్ష కూడా జరగకుండానే, యడ్డీ రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి పదవీబాధ్యతలను చేపట్టబోతున్నారు.