విజయవాడ, జూన్ 16,
తమను తాము కాపాడుకోవడానికి కొందరు అనేక విచిత్రంగా మారుతుంటారు, మాట్లాడుతూంటారు. ఒకరికి ఇబ్బందికరంగా వున్నది తమ దృష్టిలో పెద్ద నేరం కాదనిపిస్తుంది. అదే తమ దాకా రాగానే గొగ్గోలు పెట్ట డం గురించి వింటూంటాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నది. అయితే ఈడీ తన పని తాను చేసుకుపోతోందని విపక్షాలు అంటున్నాయి. చిత్రంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంకాస్త గొంత సవరించుకుని విలేకరులతో మాట్లాడుతూ ఈడీ అధికారులు రాహుల్ గాంధీని పిలిచి ప్రశ్నించడం లో కేంద్రం కక్షసాధింపు చర్యలు చేయడంలేదని అన్నారు. కాంగ్రెస్ నేతను ఈడీ విచారించడంలో తప్పులేదని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న ధోరణి విజయసాయి రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మరో గొప్ప వాక్యం వినిపించారు.. కర్మ సిద్ధాంతంతో పాటు చేసిన పాపాలు అనుభవించాల్సిందే.. అని! ఎంతో లోతయినా తాత్వికత రెడ్డిగారు ప్రదర్శించారు. మరి ఈ తత్త్వం వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయంలో గుర్తుకు రాలేదు ఎందుకో? జగన్ రెడ్డి కేసుల్లో మరి ఈడీ పిలిచినపుడల్లా లేదా జగన్ ని మోదీ ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెడుతోం దని, ఈడీ సమన్లు జారీ చేసి ఢిల్లీకి పిలిచి వేధిస్తున్నారనో రుష్యేంద్రమణి, కన్నాంబ స్థాయిల్లో తెగ బాధ పడిపోతూ ఈ అన్యాయానికి అంతే లేదా భగవాన్ బాధను ఢిల్లీ దాకా వినిపించేట్లు గొగ్గొలు పెట్టినపుడు మరి విజయసాయి రెడ్డిగారికి వారి ధర్మసూత్రం ఎందుకు గుర్తుకు రాలేదో ఆయనే చెప్పాలి. ఒకరికి ఒక ధర్మం మరొకరి విషయంలో మరో ధర్మం అంటూ ఈడీ అనుసరిస్తుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అది సర్వస్వతంత్య్ర సంస్థ గనుక.నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించాలన్నప్పటి నుంచీ పాపం ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ నాయకులు తెగ బాధపడిపోతున్నారు. కేంద్రం కక్షసాధించడం లేదని, సుబ్ర మణ్య స్వామి వేసిన పిల్ పైనే విచారణ జరుగుతోందని అన్నారు. అంతేకాదు రాజకీయాలు ఆపాదించ డం తగదంటూ బిజెపీకి మద్దతుగా వైసీపీ ఎంపీగారు గొంతు సవరించడం గమనార్హం. ఇదిలా వుండగా హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని విచారిస్తున్న ఈడీ తాము ఆశించిన సమాధానాలు రాహుల్ నుంచి రావడం లేదని అసంతృప్తితో వున్నారట. రాహుల్‌ని ఈడీ అధికారులు వేధిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు 144వ సెక్షన్ విధించారు.