YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఢమాల్ మన్న జగన్ గ్రాఫ్

ఢమాల్ మన్న జగన్ గ్రాఫ్

విజయవాడ, జూన్ 16,
జగన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు పదవ తరగతి పరీక్ష ఫలితాల కంటే, అద్వాన్నంగా ఉందని, జగన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. నిజానికి..గడపగడపకు కార్యక్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో శ్రీ సర్కార్ వారికి  క్లియర్ కట్ గా అర్థమైంది. అదే విధంగా సామాజిక న్యాయ భేరి పేరుతో ఓ ఇరవై మంది వరకు  కీలక శాఖల ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర కూడా తుస్సు మంది. ఎక్కడికక్కడ జనాలు మంత్రులను నిలదీశారు. చివరకు మంత్రుల స్వంత ఇలాకాలోనూ జనాగ్రహం కట్టలు తెంచుకుంది.  వైసీపీ కేడర్ నుంచి కుడా    వ్యతిరేకత ఎదురు కావడంతో  మంత్రులు తలలు పట్టుకోవలసి వచ్చింది. కార్యక్రమాలను రద్దు చేసుకుని పలాయనం చిత్తగించిన సందర్భాలు కూడా లేక పోలేదని అంటారు.  ముఖ్యమంత్రి, జగన్ రెడ్డి మంత్రులు, వైసీపీ  సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.మూడేళ్ళలో ఎన్ని బటన్లు నొక్కాం ఎన్నిలక్షల కోట్ల రూపాయలు పందారం చేశాం”  .. సో మనదే మళ్ళీ విజయం అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లెక్కలు చెపితే, సమవేశంలో పాల్గొన్న వారే ముసి ముసిగా నవ్వుకున్నారు. దొంగతనంగా పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటుంది, నడ్డి విరిగిన తర్వాతగానీ, సత్యం బోధపడదు. మా జగనన్న పరిస్థితి కూడా అదే, అంటూ చిద్విలాసంగా నవ్వుకుంటున్నారు.అలాగే,  ఈసారి ఎన్నికల్లో 151 కాదు 175 సీట్లువస్తాయని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు కూడా కొంందరే అయినా కొంచెం బిగ్గరగానే నవ్వుకున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలు ‘‘అంత సీన్” లేదని, ప్రభుత్వ వ్యతిరేకత భయంకరంగా ఉందని  చెప్పడంతో, ముఖ్యమత్రి కస్సుమన్నారు.. గుస్సా అయ్యారు. జనంలో తన పలుకుబడి ఏ మాత్రం తగ్గ లేదని, ఏదైనా లోపం ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలలోనే కానీ, తన మీద వ్యతిరేకత లేనే లేదని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు.   అయితే, ఇప్పడు ఇండియా టుడే’ పత్రిక నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గ్రాఫ్ పతనం వైపు పరుగులు తీస్తోందనే భయంకర నిజాన్ని బట్ట బయలు చేసింది. గత సంవత్సరం ఆగష్టులో  ఇదే ఇండియా టుడే నిర్వహించిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న జగన్ రెడ్డి స్థానం తాజా సర్వేలో చతికల పడింది. ప్రథమ స్థానం కాదు, మొదటి పది మంది ఉత్తమ ముఖ్యమంత్రులలోనూ జగన్ రెడ్డికి స్థానం దక్కలేదు. తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రథమ స్థానాన్ని తన్నుకు పోయారు. సర్వేలో ‘స్టాలిన్ ఈజ్ ది బెస్ట్’ అని 42 శాతం మంది ఆయనకు ఓటు వేశారు.ఆ తర్వాతి స్థానలో వరసగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళ ముఖ్యమంత్రి పినరయి  విజయన్,  ఉద్దవ్ థాకరే, మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ డి నేషన్ తాజా సుర్వేలో ఏపీ సీఎం స్థానం ... 1 కాదు 2 కాదు3 కాదు... 16 ..17..18 కూడా కాదు ఏకంగా 19వ స్థానానికి జగన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది. స్థానిక పత్రికలు చెప్పినా .. ముద్ర వేసి ఛీ .. అన్నారు. రాజకీయ విశ్లేషకులు హెచ్చరించినా .. అబ్బే మీకేం తెలియదని కొట్టి వేశారు.. చివరకు సొంత పార్టీ వారే చెప్పినా ..అదే అన్నారు. మీకెవరికీ, మీటల మహిమ తెలియదని కొట్టి వేశారు.. కానీ ఇప్పడు శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అనుకున్నా, ఇండియా సర్వే కూడా అదే అదే చెప్పింది. జగన్ రెడ్డి గ్రాఫ్ జెర్రి గొడ్డులా జరా జరా జారి పోతున్న వైనాన్ని విశ్లేషించి. జగన్ రెడ్డి ఇదైనా నమ్ముతారా ..లేక అంతిమ తీర్పు కోసం నిరీక్షిస్తారా.. అది అయన ఇష్టం. అయితే, ఇండియా టుడే సర్వే నే కాదు, దగ్గరగా పరిస్థితిని గమనిస్తున్న స్థానిక  విశ్లేషకులు కూడా ముఖ్యమంత్రి గ్రాఫ్ తో పాటుగా వైసీపే ప్రభుత్వ గ్రాఫ్ కూడా పతనం వైపుకు పరుగులు తీస్తోందనే అంటున్నారు

Related Posts