YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీని పుట్టముంచుతున్న కలహాలు

వైసీపీని పుట్టముంచుతున్న కలహాలు

విజయవాడ, జూన్ 16,
ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి…ఆ నియోజకవర్గం..ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా చాలా చోట్ల ఈ రచ్చ నడుస్తోంది..మరి ఎవరికి వారే అధికారం చెలాయించాలని చూస్తున్నారో లేక..తామే అంతా రూల్ చేయాలని అనుకుంటున్నారో తెలియదు గాని…రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఓ వైపు సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా ఉండాలని జగన్ చూస్తుంటే..మరో వైపు ప్రతిపక్షాలు జగన్ ని నెగిటివ్ చేసే పనిలో ఉన్నాయిఅయినా సరే ప్రతిపక్షాల తాకిడిని తట్టుకుని జనంలో తన బలం ఏ మాత్రం తగ్గకూడదని జగన్ కష్టపడుతున్నారు…కానీ ఆ బలాన్ని సొంత పార్టీ నేతలే తగ్గించే పనిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. వీరి అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంది..ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వీక్ అవుతూ వస్తుంది…ఇంకా నేతల మధ్య రచ్చ వల్ల మరింత వీక్ అయ్యేలా ఉంది. అసలు జిల్లాకు నాలుగైదు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది.ఉదాహరణకు కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కర్నూలు సిటీ, కోడుమూరు నియోజకవర్గాల్లో రచ్చ ఉంది..ఇటు కృష్ణాలో…బందరు, గన్నవరం, పెడన, కైకలూరు…ఇంకా పలుచోట్ల పోరు ఉంది. అటు గుంటూరులో తాడికొండ, బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్..ఇలా వరుసపెట్టి చాలా జిల్లాల్లో నేతల మధ్య వార్ నడుస్తోంది. విశాఖ సౌత్, పాయకరావుపేట, నెల్లూరు, పర్చూరు, నరసాపురం, రాజమండ్రి, సాలూరు, కురుపాం…ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో వైసీపీలో ఆధిపత్య పోరు కనిపిస్తోంది.ఇప్పటికే చాలామంది నేతలని తాడేపల్లికి పిలిచి జగన్ క్లాస్ పీకారు…అయినా సరే చాలామంది నేతల్లో మార్పు రాలేదు..ఇంకా ఏదో విధంగా రచ్చ లేపుతూనే ఉన్నారు..అయితే ఎన్నికల వరకు ఇలాగే రచ్చ తీసుకెళితే…ఎన్నికల్లో వైసీపీకే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి…చివరికి జగన్ కు సీఎం అయ్యే అవకాశాలు తగ్గుతాయి…కాబట్టి ఆధిపత్య పోరు తగ్గితేనే జగన్ కు మంచిది.

Related Posts