YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బిజెపికి పతనం తప్పదు

బిజెపికి పతనం తప్పదు

కడప
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై ప్రజలకు అసహనం ఏర్పడుతూ ఉండటం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరగడం వల్లనే కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లపై  బిజెపి ప్రభుత్వ కేసులు పెడుతోందని కాంగ్రెస్ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు అన్నారు.
రాహుల్ గాంధీ పై అక్రమ ఈ డి కేసులను నిరసిస్తూ విశ్వేశ్వరయ్య సర్కిల్లో బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కి , రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని దీంతో తీవ్రంగా భయపడుతున్న నరేంద్ర మోడీ ఆడలేక మద్దెల ఓడు అన్నచందంగా అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని గంటల తరబడి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపడం అభ్యంతరకర మన్నారు.10 సంవత్సరాల నాటి కేసును తిరగదోడీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పై బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరీస్తోంది అన్నారు. భారత్ జోడో పేరిట రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు  పాదయాత్ర చేయాలని సంకల్పించడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ కేసులకు తెగబడింది అన్నారు.జాతీయ పార్టీ నాయకుడి పై గంటల తరబడి, రోజుల తరబడి విచారణఏంటనిప్రశ్నించారు.మోడీఅడుగడుగునా ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ వారిపై కేసులు పెడుతున్నారు అన్నారు.
కేసులకు భయ పడ కుండా ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ నేతలు పోరాడుతారు అన్నారు.
బిజెపి కి కాలం చెల్లిందని, 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తధ్యమని నీలి శ్రీనివాస రావు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నేత ఎస్ ఏ సత్తార్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెo విజయభాస్కర్, మైనార్టీ నాయకుడు అలీఖాన్, పిసిసి మెంబర్ చీకటి చార్లెస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటపాటి లక్ష్మయ్య, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మామిళ్ల బాబు, మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్యామలా దేవి, డాక్టర్ అన్వర్, వదూద్ ఖాన్, మైన్ ఉద్దీన్, నగర ఉపాధ్యక్షుడు మధు రెడ్డి, సురేష్, ప్రసాద్, శంకర్, అరుణ, పుష్ప, లోకేశ్వరి, ఆసిఫ్, సత్యం, రఫీ పాల్గొన్నారు.

Related Posts