కడప
గత మూడు రోజులుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వద్దకు విచారణ పేరుతో పిలుస్తుండటం తో, గంటల తరబడి విచారణ చేస్తుండం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తెలుపుతున్న నిరసనలో భాగంగా, ఏపి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడలోని గవర్నర్ భవన్ ముందు శాంతియుత నిరసనకు బయలుదేరగా విజయవాడ పోలీసులు అతనిని అడ్డుకోవడం ,అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం అప్రజాస్వామికమని ఆపార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు మండిపడ్డారు .
కడపలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
ఎనిమిది సంవత్సరాల పాలనలో బిజెపి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రజల మధ్య కులం పేరుతో మతం పేరుతో ద్వేషం రగిలించింది అని అన్నారు.
అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది అన్నారు.రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అతనిపై ఈడీ కేసునమోదుచేస్తున్నారన్నారు.మన రాష్ట్రంలో సైతం ప్రతిపక్షాలను మాట్లాడని వ్వడం లేదన్నారు.
ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రెండు సంవత్సరాలలో ప్రజలు బిజెపికి గోరి కడతారన్నారు.