YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

21 తర్వాతే రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయం

21 తర్వాతే రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయం

న్యూడిల్లీ, జూన్ 18,
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓ కీలకాంశం తెరమీదికి వస్తుంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఏకాభిప్రాయానికి, ఏకగ్రీవానికి అధికార ఎన్డీయే కూటమి విపక్షాలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టింది. అయితే, ఏకగ్రీవ యత్నాలను నెరపుతున్న నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించినా విపక్ష నేతల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఏకగ్రీవం కోసం జరిపే యత్నాలు సఫలమవడం అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆజాదీకా అమృత మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి రాష్ట్రపతి ని ఏకగ్రీవం చేద్దామని మోదీ  తరపున రాజ్‌నాథ్ సింగ్  జేపీ నడ్డా  వంటి నేతలు విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే , శరద్ పవార్, మమతా బెనర్జీ (లకు సూచించారు. ఏకగ్రీవం సంగతి సరేగానీ.. అధికార కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ముందు చెప్పాలని ఖర్గే, పవార్, బెనర్జీ ఎన్డీయే  ప్రతినిధులను నిలదీశారు. ముందు అభ్యర్థి ఎవరో చెబితే అప్పుడు ఎన్నికలు జరుగుతున్న ప్రత్యేక సందర్భం అతనికి వర్తిస్తుందో లేదో ఆలోచిస్తామని విపక్ష నేతలు కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.జూన్ 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల పర్వం మొదలైన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజు విపక్షాలతో సమావేశం నిర్వహించారు మమతా బెనర్జీ. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌ సుమారు రెండున్నర గంటలపాటు 17 విపక్షాలు భేటీ అయ్యాయి. ఈ భేటీలో విపక్షాల తరపున రాష్ట్రపతి పదవికి పోటీ చేయాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆల్మోస్ట్ అన్ని విపక్షాలు కోరాయి. అయితే వారి వినతిని శరద్ పవర్ తిరస్కరించారు. తానింకా యాక్టివ్ పాలిటిక్స్‌లోనే వున్నానని, అందుకే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనని శరద్ పవార్ సమావేశంలో చెప్పారు. అయితే.. ఎలాగో ఓడిపోయే పదవికి పోటీ చేసి పరువెందుకు తీసుకోవాలన్న భావనతోనే శరద్ పవర్ రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకున్నట్లు ఎన్సీపీలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా జూన్ 15వ తేదీన మమత నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదు. పవార్ వద్దన్న తర్వాత గోపాలకృష్ణ గాంధీ  ఫరూఖ్ అబ్దుల్లా  పేర్లను మమత ప్రతిపాదించినా వారిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మహాత్మా గాంధీ మనవడైన గోపాలకృష్ణ గతంలో 1993 ముంబయి బాంబుదాడుల కుట్రదారు యాకుబ్ మెమొన్  అలియాస్ టైగర్ మెమొకు క్షమాభిక్ష పెట్టాలన్న స్టేట్‌మెంటుతో వివాదాస్పదుడయ్యాడు. ఇటు ఫరూఖ్ అబ్దుల్లా కశ్మీర్‌ పరిపాలనా హక్కులు భారత్ దగ్గర వుండడం కంటే చైనా దగ్గర వుండడం బెటరన్న స్టేట్‌మెంట్‌లో ఫరూఖ్ అబ్దుల్లా కాంట్రవర్షియల్ పర్సన్ అయ్యాడు. ఇలా దేశ సార్వభౌమత్వానికి భిన్నంగా మాట్లాడిన వారిని దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి హోదాలో ఎలా చూస్తామని పలువురు ప్రశ్నిస్తున్నారు.  మమత నిర్వహించిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. జూన్ 21వ తేదీన 17 విపక్షాలు మరోసారి ఢిల్లీలోనే భేటీ అవ్వాలని తాజాగా నిర్ణయించాయి. నిజానికి తదుపరి సమావేశం శరద్ పవార్ ఆధ్వర్యంలో ముంబయిలో నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. తాజాగా దానిని న్యూఢిల్లీకి మార్చారు. అయితే.. ఈ భేటీని ఎవరు నిర్వహిస్తారో క్లారిటీ లేదు. ఈలోగా ప్రతి పార్టీ ఎంతో కొంత కసరత్తు చేసి.. ఒకటి రెండు పేర్లతో సమావేశానికి రావాలని.. సమన్వయం బాధ్యతలను చేస్తున్న మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్ వివిధ పార్టీల నేతలను కోరారు.ఓవైపు అధికార కూటమి తరపున రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తిపై పోటీకి ధీటైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు విపక్ష కూటమి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు అధికార పక్షం స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంలో నిర్వహించుకుంటున్న ఆజాదీకా అమృత మహోత్సవం మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి ప్రతిష్టాత్మకంగా భావించి ఏకగ్రీవానికి సహకరించాలని అధికార పక్షం విపక్షాలను కోరుతోంది. ఈ మేరకు మోదీ ఆదేశాల మేరకు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాలు.. శరద్ పవార్, మల్లికార్జున ఖర్గే, మమతాబెనర్జీలతోపాటు నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్ వంటి నేతలను సంప్రదించారు. అయితే, ఆజాదీకా అమృత మహోత్సవం అంశాన్ని ఈ నేతలు పెద్దగా ఖాతరు చేయలేదని తెలుస్తోంది. ముందుగా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎవరో ప్రకటించాలని, అప్పుడు మాత్రమే ఏకగ్రీవం అంశాన్ని పరిశీలిస్తామని విపక్ష నేతలు తేల్చేసినట్లు సమాచారం. విపక్షాల స్పందనను విశ్లేషిస్తున్న వారు.. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అవడం దాదాపు అసాధ్యమేనని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన మహిళనో, ముస్లిం నేతనే అధికార ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే పనిలో పడిపోయారు కమలనాథులు. అయితే, జూన్ 21న విపక్షాల భేటీ తర్వాతనే ఎన్డీయే కూటమి అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. అప్పటిగానీ విపక్షాల వ్యూహంపై క్లారిటీ రాదని, అందుకే జూన్ 21 తర్వాతనే తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం వుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Related Posts