YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

40 శాతం నేరచరితులే

40 శాతం నేరచరితులే

న్యూడిల్లీ, జూన్ 18,
తమ‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసుకుని ధ‌న్యులం కావాల‌ని దీక్ష‌బూని మ‌రీ అధికారంలోకి వచ్చా మ‌ని ప్ర‌జాప్ర‌తినిధులు ఘనంగా చెప్పుకోవడం వింటుంటాం. కానీ చిత్రంగా ఫ‌లానా హ‌త్య‌ వెనుక, లేదా ఫ‌లానా గూండాల దాడి వెనుక ఫ‌లానా ఎమ్మెల్యే, ఫ‌లానా మంత్రి వున్నార‌ని విని తెగ ఆశ్చ‌ర్య‌పోవ‌డ‌మూ చాలా కాలం నుంచి వున్న‌ది. ప్ర‌జ‌ల సేవే ప‌ర‌మ‌ ధ‌ర్మంగా ప్ర‌చారం చేసి ఎన్నిక‌ల్లో గెలిచిన‌వారిలో చాలా మందికి అస‌లు మాన‌వ‌త్వ‌మే వుండ‌ద‌న్నది తెలియ‌జేసిన సంఘ‌ట‌న‌లూ జ‌రుగుతున్నాయి. దేశ‌ వ్యాప్తంగా చాలామంది నాయ‌కులు, మంత్ర‌లు నేర‌ చ‌రిత్ర క‌లిగిన‌వారే అని మీడియా బ‌య‌ట‌పెట్టింది. పెద్దల సభకు విద్యావంతులు, సామాజిక సేవా రంగంలో  నిస్వార్థంగా సేవ చేసిన వారిని పార్టీలు ఎంపిక చేసి మరీ పంపుతాయని అనుకుంటాం కానీ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాస్వామ్య విలువలు పట్టవడనానికి ఇటీవల   రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల్లో 40 శాతం ఎంపీలకు నేరచ‌రిత్ర ఉంద‌నీ, ఇందులో 12 శాతం ఎంపీల‌పై సీరియ‌స్ క్రిమినల్ కేసులు ఉన్నాయనీ నేషనల్ ఎలక్షన్ వాచ్,  అసోసియేషన్ ఫర్ ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ (ఏడి ఆర్‌) తెలి పాయి. వీరిలో ఎక్కువ మంచి హత్య, మహిళలపై లైంగిక దాడుల ఆరోప‌ణలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొ న్నాయి. అభ్య‌ర్ధుల నామినేష‌న్ సందర్భంగా దాఖ‌లు చేసిన అఫిడెవిట్లే వారి నేర‌చ‌రిత్ర‌ను వెల్ల‌డిం చ‌డం గ‌మ‌నార్హం.   ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన 57 మంది స‌భ్యుల్లో ఏకంగా 23 మంది (దాదాపు 40 శాతం) పై  క్రిమిన‌ల్ కేసులు వున్న‌ట్లు  ఏడిఆర్ తెలిపింది.అలాగే 12 మందిపై (21 శాతం) హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం, దొంగత‌నం, మ‌హిళ‌ల‌పై నేరాలు వంటి తీవ్ర‌మైన నేర కేసులున్న‌ట్లు కూడా ఏడిఆర్ వెల్ల‌డించింది. పార్టీల‌వారీగా  ఇచ్చిన నివేద‌క  ప్ర‌కారం బిజెపీ నుంచి ఎన్నికైన  22 మంది  రాజ్య‌స‌భ స‌భ్యుల్లో  9 మందికి, 9 మంది కాంగ్రెస్ ఎంపీల్లో న‌లుగురికి, టిఆర్ ఎస్‌,ఆర్జేడీకి చెందిన  ఇద్ద‌రేసి ఎంపీలు, వైసీపీ,   డీ ఎంకే, ఏఐడిఎంకే, స‌మాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఎస్‌హెచ్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ నుంచి ఒక్కో ఎంపీకి  నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్‌ వివరించింది. రాష్ట్రాల ప‌రంగా చూస్తే.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆరుగురు, మహారాష్ట్ర, బీహార్‌ నుంచి నలుగురు, తమిళ నాడు నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానా నుంచి ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లు నివేదిక పేర్కొంది. ఈ నెలలో రాజ్యసభకు ఎన్ని కైన మొత్తం 57 మంది ఎంపీల స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించి నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్,  నేషనల్ ఎలక్షన్ వాచ్ తెలిపాయి. ఈ నివేదిక‌ల్లో పేర్కో న్న 57 మంది ఎంపీలలో 23 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించార‌ని నివేదిక తెలిపింది.కొత్తగా ఎన్నికైన 57 మంది ఎంపీల చర, స్థిరాస్తులను విశ్లేషిస్తూ.. వారిలో 53 మంది (93 శాతం) మిలియనీర్లని తెలిపింది. మొదటి మూడు సంపన్న అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థ సారధి మొత్తం రు. 1,500  కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారని నివేదిక పేర్కొంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ మాజీ నాయకుడు కపిల్ సిబల్ నిలిచారు. ఆయ‌న మొత్తం ఆస్తు ల విలువ రు.608 కోట్లకు పై మాటే.  ఇక‌.. పంజాబ్ నుండి కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ రు. 498 కోట్ల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు. 2022లో రాజ్యసభకు కొత్తగా ఎన్ని కైన ఎంపీల సగటు ఆస్తుల విలువ  రు. 154.27 కోట్లు అని నివేదిక పేర్కొంది.

Related Posts