YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ రాజీనామా చేయాలంటున్న నెట్ జన్లు

మోడీ రాజీనామా చేయాలంటున్న నెట్ జన్లు

న్యూడిల్లీ, జూన్ 18,
అధికారంలో వున్నాం గ‌దా అని త‌స్మ‌దీయుల‌కు వీల‌యినంత ఎక్కువ సేవ చేస్తే ఆన‌క స‌మ‌స్య‌లు త‌ల‌కు చుట్టుకుంటాయ‌న్న సూత్రం ప్ర‌ధాని మోదీజీకి బొత్తిగా అర్ధ‌మ‌యిన‌ట్టు లేదు.  అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత  త‌న‌కు, బిజెపీ పార్టీకి ఎంత‌యినా గుజ‌రాతీ వ్యాపారులు, పారిశ్రామిక‌వేత్త‌లు వెన్నుద‌న్నుగా నిలిచార‌ని  ఆ ప్రేమ‌తో వారికి ఎంత సాయం చేసిన త‌క్కువే అనుకున్నారు ప్ర‌ధాని మోదీజీ. ఇదుగో స‌రిగ్గా ఇక్క‌డే ప్ర‌ధాని త‌ప్పులో కాలేసేసేరు!  అదానీకి  శ్రీ‌లంక  ప్రభుత్వం నుంచి ప‌వ‌ర్ ప్రాజెక్టును ఇప్పించా రు.  ఫ‌లితంగా  ప్ర‌ధానిని వెంట‌నే రాజీనామా చేయాల‌న్న డిమాండ్ తో   నెటిజ‌న్లు ట్విట‌ర్‌ను హోరెత్తిస్తున్నారు. పొరుగు దేశం శ్రీ‌లంక అస‌లే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి నానా ఇబ్బందుల్లో వుంది. భార‌త్‌ నుంచి సాయం పొందడానికి కూడా సిద్ధ‌ప‌డింది. ఈ ప‌రిస్థితుల్లో పొరుగు దేశానికి మ‌న‌స్పూర్తిగా, ఎలాంటి  స్వార్ధ చింత‌నా లేకుండా సాయం చేయాల్సింది పోయి, వారి నుంచే ఒక పెద్ద‌ సాయం అడిగేసేరుమ‌న  ప్ర‌ధాని. అదే శ్రీ‌లంక విండ్ ప‌వ‌ర్ ప్రాజెక్టును త‌మ వీరాభిమాని అదానికి ఇవ్వాల‌ని. శ్రీ‌లంక ప్ర‌భుత్వం అందుకు పూర్తిగా మ‌న‌స్పూర్తిగా అయితే అంగీక‌రించ‌లేదు. కానీ అంగీక‌రించేట్టు శ్రీ‌లంక ప్ర‌ధాని అధ్య‌క్షుడు గొట‌బ య రాజ‌ప‌క్సే పై ఎంతో   ఒత్తిడి చేశార‌న్న‌వార్త‌లు ఒక్క‌సారిగా గుప్పు మ‌న్నాయి.  ఇంత‌కంటే దేశానికి వేరే అవ‌మానం అక్క‌ర్లేదు. ప్ర‌ధాని అంత అవ‌మాన‌క‌ర ఒప్పందానికి ఎందుకు అంగీక‌రించిన‌ట్టు. మోదీ శ్రీ‌లంక అధ్య‌క్షుడిని ఒత్తిడి చేసి అంగీక‌రించేట్టు చేశార‌నే ఆరోప‌ణ‌లు వెల్లు వెత్త‌డంతో ప్ర‌ధానిని రాజీనా మా చేయాల‌న్న హ్యాష్‌ట్యాగ్ ట్విట‌ర్‌లో ట్రెండ్ అవుతోంది.  దేశ‌మంతా వ్య‌క్త‌మ‌వుతున్న ఆరోప‌ణ‌ల నేప థ్యంలో తెలంగాణా రాష్ట్ర‌స‌మితి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో పాటువేలాది మంది నెటిజ‌న్లు మోదీ రాజీ నామా చేయాల‌ని గ‌ట్టిగానే డిమాండ్  బాగా జోరందుకుంది.    ట్విట్టర్ లో ప్రారంభం అయిన మోదీ మస్ట్ రిజైన్   హాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ట్విట్లర్లో ఇదే  ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.   టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అనేక మంది ఇతర నెటిజెన్లు ట్వీట్లు చేశారు. వీటికి  భారీ స్పందన లభించింది. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం వీరికి తోడు కావడంతో ట్విట్టర్ లో   మోదీ రాజీనామా అంశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో మోదీ  రాజీనామా అంశం చర్చనీయాంశంగా మారింది.అదాని కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అదానీకి  కేంద్ర ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని నెటిజన్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. భారత సంపద దోచి అదానీకి పంచడం సరికాదంటూ ట్విట్టర్లో పోస్టింగ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ  హాష్ ట్యాగ్ కు కొంతమంది వ్యతిరేకిస్తూ.. మోదీకి సపోర్ట్ గా  కామెంట్లు పెడు తున్నారు. ఇదిలా ఉంటే మోదీపై ఆరోపణలు చేసిన శ్రీలంక సిలోన్ విద్యుత్ సంస్థ చైర్మన్ ఫెర్డినాండో తన పదవికి రాజీనామా చేశారు. మోదీనే అదానికి విద్యుత్ ప్రాజెక్ట్ కేటాయించాలని తనపై ఒత్తడి తెస్తున్నాడని శ్రీలంక అధ్యక్షుడు తనతో చెప్పారని ఫెర్డినాండో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక్క‌డ మ‌రో చిత్ర‌మేమంటే  తమ మధ్య ఈ ప్రస్తావనే రాలేదని అధ్య క్షుడు గోటబయ రాజపక్స తాపీగా వెల్లడించడం.

Related Posts