YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కమలానికి కాసుల వరద

కమలానికి  కాసుల వరద

న్యూఢిల్లీ, జూన్ 20,
బెల్లం చుట్టూ చీమలు  చేరడం ఎలాగో, అధికార పార్టీల చుట్టూ బడా బాబులు. కార్పొరేట్ ఆసాములు చేరడం అలాగే సహజం. అలాంటప్పుడు, ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో, ఇంచు మించుగా అంతే కాలంగా మరో పదహారు,పదిహేడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ చుట్టూ పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ శక్తులు చేరడం కూడా అంతే సహజం. అయితే ఇప్పడు విషయం ఏమంటే రాజకీయ పార్టీల ఆదాయం లెక్కల్లో బీజేపే ప్రధమ స్థానంలో ఉందని, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) ప్రకటించింది.  అవును ఏడీఆర్ ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 2020-21 సంవత్సర ఆదాయానికి సంబంధించిన గణాంకాలను ఏడీఆర్ విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే పార్టీల ఆదాయం భారీగా తగ్గింది.అవును,నిజమే. కరోనా దెబ్బ రాజకీయ పర్త్యలను కూడా వదల లేదు కావచ్చును. అదలా ఉంటే 2020-21 సంవత్సరానికి గానూ ఎనిమిది జాతీయ పార్టీలు కలిపి  రూ.1,373.78 కోట్ల ఆదాయాన్ని పొందాయని నివేదిక వెల్లడించింది. ఇందులో బీజేపే ఒక్కటే  55 శాతం మనీ ఎగరేసుకు పోయింది. అలా బీజేపీ ఖాతాలో రూ.752.33 కోట్లు చేరాయి. ఆ తర్వాత రూ.285.76 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 79.24 శాతం మేర బీజేపీ ఆదాయం తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో  రూ.3,623 కోట్లు కాగా తాజాగా రూ.752.33 కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఆదాయం కూడా గతంతో పోల్చితే 58.11 శాతం తగ్గింది. టీఎంసీ, ఎన్‌సీపీ, బీఎస్పీ, ఎన్పీపీ, సీపీఐ ఆదాయం కూడా భారీగానే తగ్గింది. అన్ని పార్టీల కంటే గరిష్ఠంగా ఖర్చు చేసింది. సుమారు రూ.566 కోట్ల మేర ప్రచారానికి వెచ్చించింది. రూ.180 కోట్ల ఖర్చుతో కాంగ్రెస్ తరువాతి స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ రూ.93 కోట్లు ఖర్చు చేసింది.ఎందుకనో ఏడీఆర్ నివేదిక తెలుగు రాష్ట్రాల పార్టీల లెక్కలు చెప్పలేదు. కొంపతీసి తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న పార్టీలను ఏడీఆర్ ప్రాంతీయ పార్టీలుగా భావించిందో ఏమో, అయినా తెరాస  ఎంత రిచ్చో ... వేరే ఇంకెవరో చెప్పడం  ఎందుకు, స్వయంగా పార్టీ అధ్యక్షులవారే పార్టీ ప్లేనరి వేదిక నుంచే టీఆర్ఎస్ సుసంపన్నమైన పార్టీగా పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నిధుల కొరత లేదని తెలిపారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతామంటే నిధులు ఇస్తామని ఎంతోమంది ముందుకొచ్చారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ దగ్గర రూ. 865 కోట్ల నిధులు ఉన్నాయని.. వాటిపై ప్రతి నెల 3.84 కోట్ల వడ్డీ వస్తోందని అన్నారు. ఆ వడ్డీ డబ్బు కూడా రూ.24 కోట్లు దాటిందని అన్నారు.ఇది కాక మరో వెయ్యి కోట్ల విలువ చేసే స్థిరాస్తులున్నాయని, ఆయనే  చెప్పారు. సో.. తెలంగాణ రిచ్ స్టేట్, తెరాస రిచ్ పార్టీ .. కానీ,  తెలంగాణ ప్రజలు మాత్రం కాదు. ఒక్కొకరి నెత్తిన లక్షన్నర వరకు అప్పుంది.

Related Posts