ఉద్యమాల పురిటి గెడ్డ రాజకీయ నేతల ఉద్యమానికి పోరాటానికి మరోసారి వేదిక కాబోతోంది. ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీలపై ఉద్యమ గళాన్ని ఉదృతం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో 17 రోజుల పాటు పోరాటానికి సిద్దమవుతుంటే, 22వ తేదీన ధర్మపోరాట దీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షను చేపట్టనున్నారు.అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలు చేస్తున్న హాడావుడి ప్రజల్లో హైప్ ను క్రియేట్ చేసేందుకు నేతలు తమ ఫ్యూహాలకు పదును పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరాంధ్ర కేంధ్రంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్యమానికి సిద్దమవుతున్నారు. 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలను చేపట్టి రాష్ట్ర ప్రయెజనాల కోసం కేంధ్రంతో పోరాటానికి సన్నద్దమవుతూనే, ప్రజాక్షేత్రంలోకి వేళ్లేందుకు మరింత దూకుడు పెంచారు. 45 రోజుల యాత్రలో భాగంగా 17 రోజులపాటు ఉత్తరాంధ్రలో సాగనున్న యాత్ర రూట్ మ్యాప్‌పై పవన్ కళ్యాణ్ పార్టీ జిల్లా నేతలతో చర్చించారు. పర్యటన సాగనున్న ప్రాంతాల్లోని కీలక సమస్యలను ప్రజల నుంచి సేకరించిన వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు, పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్షంగా చర్చించారు.ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పవన్ యాత్ర ప్రారంభించాలని ప్రణాళికలు సిద్దం చేసుకున్న వపన్, భావనపాడు ఇతర తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల సమస్యలు, భోగాపురం విమానాశ్రయ నిర్వాసితుల సమస్య లో దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ప్రజా సమస్యల పై నిరంతర పోరాటానికి నేను సిద్దంగా ఉన్నాను అని జనసేన అధినేత పవన్ అన్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం మత్యకార గ్రామం గంగవరంలో ప్రజలతో సమావేశం అయిన జనసేనాని అక్కడి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టీకి తీసుకువెళ్ళి పరిష్కరం అయిన విధంగా పోరాడుతాను అని పవన్ అన్నారు, భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గున్నారు.కచ్చితంగా తమ సమస్యలపై జనసేనా పోరాటం చేస్తుందని అన్నారు.