శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర బద్దంగా సాగుతున్నాయి అని అన్నారు. సుప్రభాతసేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు స్వామి వరకు జరిగే అన్ని సేవలు రామనుజాచార్యుల వారు నిర్ధేశించిన విధంగా అని సవ్యంగా జరుగుతున్నాయని తెలిపారు. నైవేద్యం కూడా స్వామి వారికి ఆగమశాస్త్ర ప్రకారమే జరుతుంది ఎలాంటి దోషం లేకుండా జరుగుతున్నాయని జీయర్ స్వాములు తెలిపారు.తిరుమలలో టీటీడీ అధికారులకు, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు మధ్య ఏర్పడిన వివాదంపై తొలిసారిగా పెద్ద జీయర్ శ్రీ శ్రీ పెద్ద జియ్యంగార్లు శఠగోప్పన్ రామానుజాచార్యులు మీడియా ముందుకు వచ్చారు.టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సంతోషంగా ఉందన్నారు. నూతన ప్రధాన అర్చకులు అర్చకత్వంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని నూతనంగా నియమితులైన ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. 65సంవత్సరాల వయోపరిమితి టీటీడీ లొనే కాదు ఇతర ఆలయంలో కూడా ముందు నుంచే అమలులో ఉందని ఆయన అన్నారు. పాత అర్చకులు రిటైర్మెంట్ అయిన తర్వాత కొత్తవారికి అవకాశం వస్తుందన్నారు. గొల్లపల్లి వంశానికి చెందిన రెండు కుటుంబాలకు మిరాశిలుగా ఉన్నపుడు 8 సంవత్సరాలకు ఒక్కసారి వంతుల వారిగా స్వామి వారికి కైంకర్యాలు చేసే భాగ్యం కలిగేదని వేణుగోపాల్ దీక్షితులు అన్నారు.మరో ప్రధాన అర్చకులు పైడిపల్లి వంశస్థులు కృష్ణ శేషాచలం మాట్లాడుతూ.. మా తండ్రి గారి రిటైర్మెంట్ తరువాత నాకు స్వామి వారి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. మా తండ్రిగారి పర్యవేక్షణలోనే స్వామి వారి కైంకర్యాలు నిర్వహిస్తాం అన్నారు. ఆయన పెద్దవారిని అగౌరవ పరుచకుండా వారి హోదాను తగ్గించకుండా రిటైర్మెంట్ అనే పదం బదులు వేరే పదం ఏదైనా వాడి వారికి గౌరవం ఉండే విధంగా టీటీడీ వారు మార్పులు తెస్తే బాగుంటుందని ఆయన తెలిపారు. స్వామి వారి సేవకు గాని మహా ద్వారా ప్రవేశానికి గాని,ఇతర మర్యాదలు ఎప్పటిలాగే వారికి వర్తించే విధంగా సుప్రీం కోర్టు ఆదేశాలను టీటీడీ అమలు చేస్తుందని కోరుకుంటున్నాను అని కృష్ణా శేషాచల దీక్షితులు తెలిపారు.శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలలో ఎలాంటి తప్పులు జరగలేదని ఆగమశాస్త్ర సలహాదారుల కమిటీ సభ్యులు సుందర వరాధన్ భట్టాచార్య తెలిపారు. స్వామి వారికి నైవేద్యం, ఇతర కైంకర్యాలు ఆగమశాస్త్రోక్తంగానే జరుగుతున్నాయని అన్నారు. శ్రీవారి ఆలయం లోపల ఎలాంటి కట్టడాలు కూల్చలేదని లడ్డూ పోటులో మాత్రమే మరమ్మత్తులు చేస్తున్నారని ఆగమం ప్రకారమే మరమ్మత్తులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.