YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అటు బాబు.. ఇటు పవన్... మధ్యలో జగన్

అటు బాబు.. ఇటు పవన్... మధ్యలో జగన్

గుంటూరు, జూన్ 21,
ఓ వంక రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన జిల్లాల పర్యటనలు సక్సెస్ఫుల్’గా సాగుతున్నాయి. జననీరాజనాలు అందుకుంటూ, చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. స్వచ్చందంగా తరలి వస్తున్న జనం వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చి తప్పు చేశామని, మళ్ళీ ఆ తప్పు చేయబోమని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈసారి ‘మా ఓటు, సైకిల్ గుర్తుకే’ అని ఓపెన్’గా చెపుతున్నారు. చంద్రబాబు  పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన సహజంగానే  తెలుగు దేశం కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందని, గెలుపు మీద విశ్వాసం పెచుతోందిఅందుకే ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న కార్యకర్తఃలు, నాయకులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి వెళుతున్నారు. రైతులు, యువత, ఉద్యోగులు, మహిళలు ఒకరని కాదు, జగన్ రెడ్డి బాదుడుతో విసిగిపోయిన అందరూ,  అన్నివర్గాల ప్రజలు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు,అవుతారన్న విశ్వాసం వ్యక్త  పరుస్తున్నారు.ఆదలా ఉంటే, ఇటు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర వైసీపీ నేతలలో వణుకు పుట్టిస్తోంది. పవన్ కళ్యాణ్, కౌలు రైతుల భరోసా’ యాత్రాలో  కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొట్టుపొట్టుగా తూర్పార పడుతున్నారు.కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయడం రాజకీయ జిమ్మిక్’గా చులకన చేసి చూపే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలకు సినిమాటిక్’గా చురకలు అంటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఎక్కడ తగలాలో అక్కడతగిలేలా పదునైన వ్యంగ్య విమర్శనాస్త్రాలు  సంధిస్తున్నారు. సర్కార్’ ను, అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబు దత్తపుత్రుదంటూ, వైసీపీ నేతల చేస్తున్న  విమర్శలను తిప్పుకోడుతూ, ‘నేను ప్రజల దత్తపుత్రుడినే కానీ, ఇంకెవరి దత్తపుత్రుడినో కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సీబీఐ దత్తపుత్రుడే” అంటూ ఘాటుగా చురకలు అంటించారు. అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలను ఎరగా వేసి, ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని తీవ్ర పదజాలంతో విమర్శించడమే కాకుండా, జనసేన అధికాంలోకి వస్తే, సర్కార్ దోపిడి ఉండదని, భరోసా ఇస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించైనా సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వకాలను, ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంటోంది వివరించారు. జనసేన అధికారంలోకి వస్తే దోపిడిని అరికట్టి  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.వైకాపా నాయకులకు లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉంటే,  జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా  ఉందని అన్నారు.  జగన్ రెడ్డి పై ఉన్న అవినీతి, అక్రమాస్తుల కేసులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయనకు అధికారంలో కొనసాగే అధికారమే లేదని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు.కానీ,  క్రిమినల్‌ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారు? ప్రజా ప్రతినిధులకు ఒక రూల్‌.. సామాన్యులకు మరొక రూలా? అంటూ అర్హత లేని వారు రాష్ట్రాన్ని పలిస్తున్నారని ఎద్దేవాచేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తు ప్రజలతోనే, 2009లో ఏం చెప్పానో అదే చేస్తా. ప్రజల కోసం, ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రితో విభేదించా. వ్యక్తిగతంగా నష్టపోయా. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే నా తపన. నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు. దసరా తర్వాత వైకాపా నాయకుల సంగతి చూస్తాం. అప్పటి వరకు మీరేం మాట్లాడినా భరిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఇలా ఇటు నుంచి చంద్రబాబు, అటు నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సాగిస్తున్న దండయాత్ర ముఖ్యమంత్రికి మింగుడు పడడం లేదు.దీంతో ప్రభుత్వం అడకత్తెరలో పోక చెక్కాలా నలిగిపోతోంది.మరో వంక గడపగడపన ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, ప్రశ్నల వర్షానికి సమాదానం చెప్పలేక ఎమ్మెల్యేలు, మంత్రులు బిక్క ముఖం వేస్తునారు.

Related Posts