YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అగ్నికి ఆజ్యం పోస్తున్న మంత్రులు

అగ్నికి ఆజ్యం పోస్తున్న మంత్రులు

న్యూఢిల్లీ, జూన్ 21,
అగ్నిపథ్ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నా కేంద్రం మాత్రం వెనకడుగు వేయడం లేదు. నిరసనలు ఎలా ఉన్నా ముందడుగు వేసేందుకే మోడీ సర్కార్ సిద్ధం అవుతోంది. తాజాగా ఆర్మీలో అగ్నివీరుల నియామకల కోసం భారత సైన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. జులై నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అత్యంత సెన్సిటీవ్ ఇష్యూ కావడంతో సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొంత మంది బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయనే అభిప్రాయాలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం కొత్త విషయమేమి కాదు. చాలా కాలంగా అనేక పార్టీల వారు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. అయితే ఈ జాబితాలో బీజేపీ నేతల పేర్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్లకు పార్టీ ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ పరువు కాపాడుకునేందుకు పార్టీ పరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా అగ్నిపథ్ విషయంలోనూ కొంత మంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ పరువును గంగలో కలిపేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్గీయ్ చేసిన కామెంట్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ స్కీమ్ కింద రిటైర్ అయిన వారికి దేశంలోని బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటామని, తమ పార్టీ సెక్యూరిటీ గార్డుల నియామకాల్లో అగ్నివీరులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కారణం అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ అగ్నివీరులకు డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బార్బర్, రజక వృత్తుల్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ అంశాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయ్యాయి.అగ్నివీర్ పథకంపై దేశంలోని 13 రాష్ట్రాల్లో యువత తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ప్రభుత్వ పెద్దలే ఆచితూచి వ్యవహరిస్తుంటే మరి కొంత మంది బీజేపీ నేతలు తమకు తోచిన భాష్యాలు వల్లించడం వల్ల లేని పోని తంటాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. నిజానికి అగ్నివీరుల నియామకం దేశంలో ఇదే తొలిసారి. కాంట్రాక్ట్ అని పిలిచినా మరే పేరుతో పిలిచినా దీని ద్వారా సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయనేది మొదటి బ్యాచ్ తమ సర్వీస్‌ను పూర్తి చేసుకున్నాకే ఓ అవగాహన ఏర్పడుతుంది. కానీ ఆలోపే అందనిరి అన్ని అంశాల్లో ఒప్పించగలం అని బీజేపీ భావించడం, ఈ అంశం ముసుగులో రాజకీయ చలి కాచుకుందామని ప్రతిపక్షాలు భావించడం రెండూ తప్పే అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నుపుర్ శర్మ విషయంలో కమలం పార్టీ గట్టి ఎదురుదెబ్బను చవి చూసింది. దాంతో ఎలా పడితే అలా మాట్లాడవద్దనే కీలక ఆదేశాలు సైతం పార్టీలో వెలువడ్డాయి. అయినా సరే కొంత మంది నేతలు మాత్రం నోటికి పని చెబుతూనే ఉన్నారు. వీటికి తోడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అభ్యర్థులకు తాజా నోటిఫికేషన్ పుండు మీద కారం చల్లినట్లుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Related Posts