విజయవాడ
యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశ్యం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. విజయవాడ లోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఆయుష్ శాఖ నిర్వహించిన 8వ ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఆమె జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిగా అభివర్ణించారు. భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసనమన్నారు . 'యోగ' అనే పదం సంస్కృతం నుండి పుట్టిందని నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించప బడుతోందన్నారు..రోజు రోజుకు జనాదరణ పొందుతోందన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు యోగ ను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం టి కృష్ణబాబు, కలెక్టర్ ఢిల్లీ రావు,మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ , ఆయుష్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.