అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో వాలంటీరు నగేష్ నాయక్ చెప్పుతో కొట్టుకున్నాడు. గ్రామంలో 50 మంది రైతులు ఈ క్రాప్ చేయిస్తే...ఒక్క రైతుకే పంట బీమా వచ్చింది. పంటల బీమా రాకపోవడంపై రైతులు వాలంటీర్ ను నిలదీసారు. వాలంటీర్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, అక్కడున్న వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించుకోలేదు. దాంతో వాలంటీర్, ఊర్లోకి వెళ్తే రైతులు చెప్పుతో కొట్టేలా వున్నారని, తన చెప్పుతో తాను కొట్టుకోవడం మేలంటూ చెప్పుతో కొట్టుకున్నాడు. వాలంటీర్ ఉద్యోగమే నాకు వద్దు రాజీనామా చేస్తా. రైతులకు పంటల బీమా ఇవ్వండంటూ అధికారులతో ఆవేదన వ్యక్తం చేసాడు.