కాబూల్ జూన్ 22,
భారీ భూకంపం వచ్చిదంటే చాలు ఇళ్లన్నీ నేలమట్టమావడమే కాకుండా భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. మన దేశంలో కంటే విదేశాల్లో వచ్చే భూకంపాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంటుంది. ఇక తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది. ఈ భూకంపం ధాటికి సుమారు 255 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. పాకిస్తాన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం కారణంగా భారీ ఆస్తినష్టం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సంభవించిన ఈ భూకంపం వల్ల ప్రజలు తవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద పెద్ శబ్దాలతో భూమి కంపించడంతో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు.