రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు సిద్ధవుయ్యారు. వచ్చే నెల 21 నుంచి యాత్ర చేయునున్నట్టు కమల్ ప్రకటించారు. ఈ యాత్రకు మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటుడు ఎంజీఆర్ సినిమా పేరు ‘నాలై నవుదె’ పెట్టారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్టు కమల్ వెల్లడించారు. విద్య, పారదర్శకత, ప్రజల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించనున్నట్టు తన ప్రణాళికలను వివరించారు. ఓ తమిళ మేగజైన్‌కు కవుల్ రాసిన వ్యాసంలో ఈ విషయాలు వెల్లడించారు. రాజకీయ ప్రణాళికతో యాత్ర చేయునున్నట్టు తెలిపారు. ఎంజీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని యాత్రకు ఆయన సినిమా పేరును పెట్టామని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తాను, తన అభిమానులు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. దత్తత తీసుకునే గ్రామంలో సదుపాయాలు, విద్య, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రవాణ సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమంపై కమల్ స్పందిస్తూ.. ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌ను తినలేరని, వాటి వల్ల తెలివిపెరుగుతుందని తాను భావించడం లేదేని, వాటిని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుండాలని అన్నారు.