YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో మహానటి

 రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో మహానటి

టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ బయోపిక్ మూవీ ‘మహానటి’ హిస్టారికల్ రికార్డ్స్‌ను నమోదుచేసింది. క్రియేటివ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్  లీడ్‌ రోల్‌లో తెరకెక్కించిన ఈమూవీ విడుదలైన తొలిరోజునుండి కలెక్షన్ల సునామీ దిశగా పరుగులు తీస్తోంది. రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాల హవా నడుస్తున్నప్పటికీ.. ‘మహానటి’ ధీటైన కలెక్షన్లు సాధించింది. మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ పొందింది. ఇక ఓవర్సీస్‌లోనూ తిరుగులేని కలెక్షన్లతో సత్తా చాటుతోంది. 150 లొకేషన్లలో భారీగా విడుదలైన ఈ మూవీ 5 రోజుల్లోనే మిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరి తిరుగులేని రికార్డులు నమోదు చేయగా.. 9 రోజుల్లో రెండు మిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరినట్టు ప్రముఖ మూవీ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ 120 లొకేషన్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. 

Related Posts