ఓవైపు బలపరీక్ష... మరోవైపు ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి కాంగ్రెస్, జేడీఎస్ ముందున్న సవాళ్లు... దీనిపై అసెంబ్లీలో సభ్యులంతా టెన్షన్ పడుతూ కనిపిస్తుంటే... మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య మాత్రం తాపీగా కనిపించారు. ఓ వైపు సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే... ఆయన మాత్రం అవేమీ పట్టనట్లు తన సీట్లోనే కొద్దిసేపు కునుకు తీశారు. పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే సిద్ధరామయ్యను చూసి షాకయ్యారు. కాని ఆయన మాత్రం కునుకు తీస్తూ... మధ్యలో లేస్తూ కనిపించారు. ఈ సీన్ మొత్తం కెమెరాకు దొరికింది. అసెంబ్లీలో మాత్రమే కాదు... అంతకముందు ఎన్నికల ప్రచారంలో కూడా కునికిపాట్లు పడుతూ మీడియాకు దొరికిపోయారు. రాహుల్ గాంధీ పాల్గొన్న సభలోనే నిద్రపోతూ కనిపించారు.