కర్నూలు
జిల్లా ఎస్.పిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పల్లె నిద్ర కార్యక్రమానికి జిల్లా ఎస్.పి సిధ్దార్థ్ కౌశల్ శ్రీకారంచుట్టారు. కౌతాళం మండలం, ఫ్యాక్షన్ గ్రామమైన కామవరంలో జిల్లా ఎస్.పి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు.కామవరం గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్టీసి బస్టాండ్, అంగన్ వాడి సెంటర్ ను , రైతు భరోసా కేంద్రాలను జిల్లా ఎస్.పి పరిశీలించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో ముందుగా గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్.పి మాట్లాడారు. ఫ్యాక్షన్ జోలికి ఏవరు కూడా వెళ్ళవద్దన్నారు. పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే ఏవరిని ఉపేక్షించేది లేదన్నారు. తదుపరి రోజుల్లో అన్ని శాఖల అధికారులతో మాట్లాడి గ్రామాభివృద్దికి చర్యలు తీసుకుంటామని ఎస్.పి తెలిపారు