YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఏసీడీ టెన్షన్

ఏపీలో ఏసీడీ టెన్షన్

కాకినాడ, జూన్ 25,
అద్దె ఇళ్ల‌లో వుండేవారికి, య‌జ‌మ‌నుల‌కు స‌త్సంబంధాలు వుండాలి. వున్న‌నాళ్లు అద్దె క‌డుతూండ‌టం, ఇత‌ర‌త్రా ఇబ్బందులు ఉంటే య‌జ‌మానితో మాట్లాడుకోవ‌డం ప‌రిష్క‌రించుకోవ‌డం జ‌రుగుతుంటుంది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, విద్యుత్ శాఖ వారి ద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ‌లే తెచ్చిపెడుతున్నాయి. అదే ఏసీడీ. అంటే వార్షిక విద్యుత్తు వినియోగం.  అధికంగా వాడిన కరెంటు ఆధా రంగా వసూలుచేసే అదనపు విద్యుత్తు వాడక ధరావతు(ఏసీడీ). గత ఏడాది మార్చినుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో వాడిన కరెంటును సగటుగా తీసుకుంటున్నామని డిస్కమ్‌లు చెబుతున్నాయి.యేటా ఏసీడీ మొత్తానికి ఆరు శాతం వడ్డీని మార్చి లేదా ఏప్రిల్‌ నెల బిల్లులో చెల్లిస్తామ‌ని అంటున్నాయి. పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లలో ఉండే వారే ఎక్కువ. వారు తరచూ వివిధ కారణాలతో ఇళ్లు మారుతూ ఉంటారు.  మామూలుగానే అద్దె విష‌యంలో ఇంత‌కు ముందున్న‌వారు ఎగ్గొట్టి పోతే దాన్ని కూడా క‌ట్టాలనే య‌జ‌మానులూ వున్నారు. అలాంటిది విద్యుత్ బిల్లుల విష‌యంలో మ‌రీ ప‌ట్టు బ‌ట్టి లాక్కుంటున్నారు. అస‌లే అద్దె ఇళ్లు త‌గినవి దొర‌క్క ఇబ్బందులు ప‌డే మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వారికి ఇలాంటి త‌ల‌నొప్పులు నిత్యం వుంటూనే వుంటాయి. ఇప్పుడు రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణ‌యంతో మ‌రింత స‌మ‌స్య‌ల్లో చిక్కుకోవ‌ల‌సి వ‌స్తుంది. అంత‌కు ముందున్న‌వారు  అత్యధిక విద్యుత్తును వినియోగిస్తే వాటికి సంబంధించి అదనపు విద్యుత్తు ధరావతుకు కొత్తగా అద్దెకు దిగినవారే బాధ్యత వహించాలి. ఈ ధరావతును అద్దె దారులే చెల్లించాలని ఇంటి యజమానులు ద‌బాయిస్తున్నారు.  రెండు నెలల కిందట అద్దెకు దిగిన తాము ఎందుకు చెల్లించా లని అద్దె దారులు నిలదీస్తున్నారు. దీంతో ఇంటి య‌జ‌మానుల‌కు, అద్దెకు వుండేవారి మ‌ధ్య గొడ‌వ‌లు తార‌స్థాయికి చేరుతు న్నాయి. ఏప్రిల్‌లో కొత్తగా అద్దెకు దిగేవారు ఎందుకు అంతకుముందు ఉన్న వారు  కాల్చిన అధిక కరెంటుకు బాధ్యత పడాలనేది ఒక అంశమైతే, డిస్కమ్‌ చెబుతున్న ఆరు శాతం వడ్డీ లబ్ధి ఎవరికి చెందుతుందనేది మరో కీల‌క‌ ప్రశ్న. ఏసీడీ విధానాన్ని ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. వార్షిక విద్యుత్తు సగటుపైనే ఏసీడీ ఆధారపడి ఉంటుంది. యేటా ఏసీడీ మొత్తానికి ఆరు శాతం వడ్డీని మార్చి లేదా ఏప్రిల్‌ నెల బిల్లులో చెల్లిస్తాం. నెలవారీ 500 యూనిట్లు పైబడి కరెంటు వాడేవారికే ధరావతు వర్తిస్తుంది. వినియోగదారులు బిల్లులు చెల్లించలేక కనెక్షన్‌ను నిలుపుదల చేస్తే.. డిస్కమ్‌లకు చెల్లించాల్సిన మొత్తా లను మినహాయించుకుని  ధరావతులో మిగిలిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తాం. ఏసీడీపై ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వ హించింద‌ని వివరించాయి.  అ డిస్కమ్‌ల ప్రతిస్పందనపై ఇంధన రంగ నిపుణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు మాత్రమే వర్తించే ఏసీడీ విధానం గృహ విద్యుత్తు వినియోగదారులకు వర్తింప జేయడంపై డిస్కమ్‌లు వివరణ ఇవ్వాలంటున్నారు.ఈ విధానం ఎప్పటి నుంచి ఉన్నదో డిస్కమ్‌లు చెప్పాలంటున్నారు. విద్యుత్‌ వినియోగం 500 యూనిట్లు దాటితే ఏసీడీ వర్తిస్తుందని డిస్కమ్‌లు చెబుతున్నాయి. కానీ, ఆ బెంచ్‌ మార్క్‌ దాటక ముందే  కుటుంబం ఏప్రిల్‌ నెలలో కొత్త ఇంట్లో  అద్దెకు దిగింది. ఆ కుటుంబానికి  విద్యుత్తు కనెక్షన్‌కు ఈ ఏడాది మే నెలలో విద్యుత్తు వినియోగం కింద 5,623గా డిస్కమ్‌ పేర్కొంది. దీనిలోంచి అడ్జస్ట్‌మెంట్‌ పోగా 3070గా బిల్లు పంపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌వరకూ సగటున 417 యూనిట్లు వినియోగించినట్లుగా పేర్కొంది.వారి సర్వీసు నంబరుకు రూ.13,000 ఏసీడీ కింద చెల్లించాలని డిస్కమ్‌లు పేర్కొన్నాయి. రెండు నెలల కిందట అద్దెకు దిగిన తామెందుకు ధరావత్తు కట్టాలని ఆద్దెదారు వాదిస్తుం టే తమ కేమీ తెలియదని.. ఆ పోర్షన్‌కు సంబంధించిన విద్యుత్తును తాము వాడనందున ఆ ధరవత్తును అద్దెదారులే చెల్లించా లని యజమాని అంటున్నారు. ఇదేమైనా న్యాయంగా వుందా? అని అద్దెకున్న వారు వాపోతున్నారు.

Related Posts