YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుడివాడ నుంచే టీడీపీ మొదలు

గుడివాడ నుంచే టీడీపీ మొదలు

విజయవాడ, జూన్ 25,
తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ముందుగా గుడివాడ పై దృష్టిసారించారు. గుడివాడ ఎమ్మ‌ల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి  చెక్ పెట్టాల‌న్న ల‌క్ష్యంతో తెలుగుదేశం అధినేత చంద్ర బాబు స్వ‌యంగా  రంగంలోకి దిగుతున్నారు. ఈ మేర‌కు ఆ పార్టీ వ‌ర్గాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.  నాలుగు ప‌ర్యాయాలు గుడివాడ నుంచి  గెలిచిన కొడాలి నాని ఇప్ప‌టికీ  త‌న వ్య‌వ‌హార తీరును  మార్చుకోలేదు. ప్ర‌జ‌లు  ఆయ‌న్ను అస‌హ్యించుకుంటున్నారు. ఇలాంటి వారిని మ‌రోసారి గెలవ‌నీయ‌కుండా చూడాల‌ని తెలుగుదేశం అధినేత ప‌ట్టుద‌ల‌తో వున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సంద ర్భంగా ఆయన జన్మించిన ప్రాంతం గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి, తద్వారా కొడాలి నాని, వైసీపీ ఆగడాలకు, దూకుడుకు చెక్ పెట్టేందుకు టీడీపీ  అగ్రనేతలు  కత్తులు దూస్తున్నారని సమాచారం.అవసరం ఉన్నా లేకపోయినా టీడీపీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై నోరేసుకుని పడిపోయి, బూతులతో విమర్శలు చేసే కొడాలి నాని  అంటే టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. మంత్రి పదవి నుంచి తనను జగన్ రెడ్డి  పీకి పారేసినా కూడా  కొడాలి తన  బూతు పంచాంగాన్ని ఆపడం లేదు. నాలుగుసార్లు ఓట్లు వేసి  గెలిపించి  అసెంబ్లీకి  పంపించిన గుడివాడ నియోజకవర్గం ప్రజలకు ఆయన  చేసిందేమీ లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. రోడ్ల  దుస్థితి  చెప్పక్కర్లేదు. రోజూ అనేక  స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిచే గుడివాడ బస్సాండ్ దుస్థితి కొడాలి నాని పనితీరుకు ప్రత్యక్ష నిలువెత్తు నిదర్శనం.గురివింద గింజ తన నలుపు సంగతి ఎరుగదు అన్న చందంగా కొడాలి నాని తీరు ఉందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నా పట్టించుకోకుండా పేకాటలు, భూ ఆక్రమణలు, క్యాసినోల నిర్వహణలో తలమునకలయ్యే కొడాలి నాని చంద్రబాబు పైనా, లోకేష్ పైనా నిత్యం అసందర్భ, అనుచిత ప్రేలాపనలతో కాలక్షేపం చేస్తుండడాన్ని నియోజకవర్గం ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. ఆ విధంగా విరుచుకుప‌డ‌టం త‌న‌కు, త‌న పార్టీకే న‌ష్ట‌మ‌న్న ఇంగితం కూడా లేక‌పోవ‌డం విడ్డూరం. కొడాలి నానిని, టీడీపీ వ్యవస్థాపకుడి సొంత నియోజకవర్గం గుడివాడను ఇలాగే వదిలేస్తే మంచిది కాదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నెల 29న కృష్ణా జిల్లా మహానాడులో భాగంగా గుడివాడలో లక్ష మందితో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. గుడివాడ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు టీడీపీ నేతలు నడుం బిగించారు. గుడివాడ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవాలని, బూతుల నేతకు మూతి వాచేలా చెక్ చెప్పా లనే లక్ష్యంతో టీడీపీ నేతలు, శ్రేణులు సిద్ధం అవుతున్నారు.గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఇన్ చార్జి రావి వెంకటేశ్వర రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ చంద్రబాబు బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పూర్తిస్థాయిలో రంగంలో దిగారు. కేసినో వ్యవహారంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించి నప్పుడు స్థానిక టీడీపీ నేతలను గుడివాడ నాని అండ్ కో భయపెట్టి.. బయటకు రాకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం నేరుగా రంగంలో దిగడం విశేషం. గుడివాడలో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్థానక నేతలతో ఇప్పటికే చర్చలు జరిపారు. భారీ బహిరంగ సభకు అనుకూలంగా ఉండే స్థలా ల్ని కూడా ఆయన పరిశీలించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా గుడివాడ నేతలతో సమావేశం నిర్వహించారు. జనసమీకరణను సవాల్ గా తీసుకోవాలని వారికి అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 29 సాయంత్రం గుడివాడలో మహానాడు, బహిరంగసభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో బస చేస్తారు. 30వ తేదీ ఉదయం బందరు పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను సక్సెస్ చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ‘బాదుడే .. బాదుడు’ అంటూ చంద్రబాబు చేస్తున్న ఏపీ వ్యాప్త పర్యటనలకు జనం నుంచి భారీ స్పందన వస్తోంది. గుడివాడలో కూడా తమ సత్తా చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కొడాలి నాని నోటికి తాళం వేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తు న్నారు.

Related Posts