విశాఖపట్టణం, జూన్ 25,
ఈ మధ్య ఏపీలో ఎక్కడ చూసిన వైసీపీ ఎమ్మెల్యేలని ప్రజలు నిలదీస్తున్న సన్నివేశాలే కనిపిస్తున్నాయి. తమ సమస్యలని పరిష్కరించాలని చెప్పి ప్రజలు…ఎక్కడకక్కడ వైసీపీ ప్రజాప్రతినిధులని ప్రశ్నిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రజల్లో పెద్దగా తిరగని ఎమ్మెల్యేలు…జగన్ దెబ్బకు ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లాలని జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే ప్రజల్లో బలం ఉన్నవారికే నెక్స్ట్ సీట్లు కూడా ఇస్తానని చెప్పారు.దీంతో ఎమ్మెల్యేలంతా ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. అయితే మూడేళ్లుగా కనిపించని ఎమ్మెల్యేలు ఒక్కసారిగా కనిపించేసరికి ప్రజలు తమ సమస్యలని ఏకరువు పెడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేలని నిలదీస్తున్నారు…పథకాలు అందడం లేదని, అభివృద్ధి జరగడం లేదని, అలాగే పన్నుల భారం పెంచడంపై ప్రజలు, ఎమ్మెల్యేలపై తిరగబడే పరిస్తితి. మరి ప్రజలు నిలదీస్తున్నప్పుడు ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుంది..అలాగే తప్పులు జరగకుండా చూసుకుంటామని, తాము అండగా ఉంటామని భరసా ఇవ్వాలి.మరి వైసీపీ ప్రజా ప్రతినిధులు అలాగే చేస్తున్నారా? అంటే అబ్బే లేదనే చెప్పాలి..ప్రజలు నిలదీస్తున్నారని చెప్పి. ఎమ్మెల్యేలే ప్రజలపై తిరగబడే పరిస్తితి కనిపిస్తోంది. ప్రశ్నిస్తున్న వారిపై ఎమ్మెల్యేలు ఫైర్ అయిపోతున్నారు…పైగా పరుష పదజాలంతో తిడుతున్నారు…పోలీసులతో కేసులు కూడా పెట్టిస్తున్నారు. తాజాగా విజయవాడ వెస్ట్ లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఓ యువకుడు ప్రశ్నించాడు….మీరు 1500 కోట్లు అవినీతి చేశారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు..దీనికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుంది. అలా కాకుండా యువకుడుపై కేసు పెట్టి విచారించాలని ఎమ్మెల్యే…పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతాం..లేదంటే తిడతాం…అది కాదంటే ప్రశ్నించిన వాళ్ళు టీడీపీ వాళ్ళు అని చెప్పి ముద్రవేస్తాం అన్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఉంది. ఇక ఇలాగే ముందుకెళితే వైసీపీకి ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ అయ్యేలా ఉంది. కాబట్టి జగన్ మళ్ళీ గెలవాలంటే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు మారాలని చెప్పొచ్చు.