అమరావతి
చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలతపై పోలీసు వాహనం ఎక్కించడం, హత్య కేసులో సాక్షులను పోలీసులే బెదిరించడంపై టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిజిపికి లేఖ రాసారు. చిత్తూరులో కటారి అనురాధ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరించి కేసును నీరు గార్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కోన్నారు. మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చెయ్యకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు 22వ తేదీన అధికారులను కోరారు. స్థానిక పోలీసులు బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెరిదించేలా వ్యవహరించారు. కీలక సాక్షి అయిన సతీష్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడి చేశారు. పోలీసులే తమతో పచ్చిగడ్డి తెచ్చి పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అరెస్టు చేశారు. అడ్డుకున్న మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారు. పోలీసు చర్యలను నిరసించిన హేమలతపై పోలీసు జీపు ఎక్కించడంతో ఆమె తీవ్ర గాయంతో ఆసుపత్రి పాలయ్యింది. అక్రమాన్ని నిరసించిన హేమలతను గాయపరిచింది కాకుండా....పోలీసు జీపు డ్రైవర్ పై దాడి జరిగిందని అతన్ని అసుపత్రిలో చేర్చారు. పూర్ణ పై అక్రమ కేసు పెట్టిన, హేమలతపై దారుణంగా వ్యవహరించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలి. వైసిపి వారి కోసం సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీసుపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల తక్షణ చర్యలు ఉండాలని చంద్రబాబు లేఖలో పేర్కోన్నారు.