YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హౌస్ అరెస్టులపై టీడీపీ రివర్స్ అటాక్.

హౌస్ అరెస్టులపై టీడీపీ రివర్స్ అటాక్.

విజయవాడ, జూన్  27,
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆ గడువు సమీపించే కొద్దీ టీడీపీ ఏదోక కార్యక్రమం చేపడుతూనే ఉంది. ఏదైనా సంఘటనలు జరిగితే బాధిత కుటుంబాన్ని పలకరించేందుకు బృందంగా వెళ్లడం ద్వారా పొలిటికల్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది టీడీపీ నేతలకు. హౌస్ అరెస్టులు చేస్తుండటంతో నాయకులు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఫలితంగా ముందుగా అనుకున్న కార్యక్రమం సక్సెస్ కావడం లేదనే భావనలో ఉందట టీడీపీ. ఆ అంశంపైనే తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది.కేసులు.. గృహ నిర్బందాలపై తీవ్ర తర్జనభర్జన తర్వాత విరుగుడు మంత్రం కనిపెట్టిందట టీడీపీ. ఇకపై పోలీసులపైనా ప్రైవేట్‌ కేసులతో విరుచుకుపడాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. నేతలు ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే.. దానిని సవాల్‌ చేయాలని చూస్తున్నారట. దీనిపై న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. హౌస్ అరెస్ట్ అంటే అక్రమంగా నిర్బంధించడమేనని.. పెద్ద పెద్ద కారణాలు లేకుండా అలాంటి చర్యలు తీసుకోకూడదని నిపుణులు వెల్లడించారట. అందుకే హౌస్‌ అరెస్ట్‌లకు పాల్పడి.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని భావిస్తున్న పోలీసులపై ప్రైవేట్‌ కేసులు వేయడానికి టీడీపీ నిర్ణయించిందట.గతంలో మాజీ ఎమ్మెల్యే కూన రవి ఇదే తరహాలో ప్రైవేట్ కేసు పెట్టారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఇటీవలకాలంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సైతం రూటు మార్చేశారు. మూడేళ్లుగా తనపై వరస కేసులు నమోదు చేయించుకున్న ఆయన.. రివర్స్‌ కేసులు పెడుతున్నారట. ఇలాంటి ప్రైవేట్‌ కేసుల విచారణ మరింత ముందుకెళ్తే పోలీసులు గగ్గోలు పెట్టడం ఖాయమనే ఆలోచనతో ఉన్నారట చింతమనేని. అంతేకాదు.. కొన్ని ఆరోపణలపై లోకల్‌ వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిపై అనుచరులతో కోర్టులో పిల్‌ కూడా దాఖలు చేయించారట.తరహాలో రాష్ట్రంలో పోలీసులు టీడీపీ నేతల్ని ఎవరెవర్ని అడ్డుకున్నారు? ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారనే దానిపై సమాచారాన్ని సేకరిస్తున్నారట పార్టీ పెద్దలు. జిల్లాల వారీగా జాబితాను టీడీపీ అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ జాబితాలో ప్రతి జిల్లాకు చెందిన నలుగురు నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఉన్నారని తెలుస్తోంది. ఆ విధంగా మొత్తం 55 నుంచి 65 మంది పోలీసు ఆఫీసర్లపై ప్రైవేట్ కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు.. శ్రేణులు ఈ విషయంలో పక్కా కసరత్తు చేస్తున్నారట. టీడీపీకి చెందిన న్యాయ నిపుణులు సూచించిన విధంగా వివరాలు.. ఆధారాలు దగ్గర సేకరించి.. వాటిని పక్కాగా పార్టీ రాష్ట్ర ఆఫీసుకు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ వచ్చాక.. న్యాయ నిపుణులు మరోసారి పరిశీలిస్తారట. అంతా ఓకే అనుకున్న వెంటనే పోలీసు అధికారులపై ఒకేసారి ప్రైవేట్‌ కేసులు దాఖలు చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు సమాచారం. ఏపీలో రాజకీయం వాడీవేడీగా ఉన్న తరుణంలో టీడీపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Related Posts