YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

10 మంది నేతలే లక్ష్యంగా టీడీపీ అడుగులు

10 మంది నేతలే లక్ష్యంగా టీడీపీ అడుగులు

విజయవాడ, జూన్  27,
ఏపీలో పొలిటికల్‌ టార్గెట్స్‌ పర్సనల్‌ అయ్యాయి. ఎంత తిడితే అంత ఫాలోయింగ్‌ అన్నట్టుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్‌ విమర్శలు సాధారణమే అయినా.. ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను టార్గెట్‌ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటైన విమర్శలే గుప్పిస్తున్నారు. దీన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుందట. వచ్చే ఎన్నికల్లో అలాంటి వైసీపీ నేతలను ఓ చూపు చూడాల్సిందేనని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుందట. అందుకే రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలన్నీ ఓ ఎత్తు.. ఆ పది నియోజకవర్గాలు ఇంకో ఎత్తు అన్నట్టు చర్చ జరుగుతోంది.టీడీపీ టార్గెట్‌లో టాప్‌ ప్లేస్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారట. ఆ తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ ఇద్దరి విషయంలో టీడీపీలోనే కాకుండా.. ప్రధానంగా ఆ సామాజికవర్గం నుంచి కూడా గట్టి ప్రతిక్రియ వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. వీరిద్దరినీ అస్సలు వదలొద్దు. ఓడించడానికి గట్టిగానే ప్రయత్నిద్దామని కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆపరేషన్‌ మొదలైనట్టు చెబుతున్నారు. చంద్రబాబు కూడా త్వరలో గుడివాడలో పర్యటిస్తారట. గత ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించడానికి కొడాలి నాని నాటు భాషను ఉపయోగించారు. ఇక వల్లభనేని వంశీ అయితే సైలెంట్‌గా వేయాల్సిన డైలాగులు వేసి నందమూరి, నారా కుటుంబాలు మీడియా ముందుకు వచ్చేలా చేశారు. అందుకే వీరిద్దరిపై టీడీపీతోపాటు సామాజికవర్గం కూడా గట్టిగా ఫోకస్‌ పెట్టినట్టు టాక్.ఇక టీడీపీ టార్గెట్‌లో ఉన్న నేతల్లో పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆర్కే రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు, జోగి రమేష్‌, నారాయణస్వామి తదితరులు ఉన్నారట. మరికొందరు పేర్లపై చర్చ జరిగినా.. ఈ పది మందిపై తెలుగు తమ్ముళ్లు చాలా కసిగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మూడేళ్లుగా వీళ్లంతా పనిగట్టుకుని చంద్రబాబు, లోకేష్‌లను లక్ష్యంగా చేసుకున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు వయస్సు, అనుభవానికి కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.. అన్నింటికి మించి భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్‌పై టీడీపీ కేడర్‌ రగిలిపోతోందట. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదలొద్దని అగ్రనేతలను గట్టిగా కోరుతున్నాయాట పార్టీ శ్రేణులు.చంద్రబాబు అనుభవం వంత వయసు లేని రోజా, జోగి రమేష్‌ అనిల్‌, కన్నబాబు వంటి వాళ్ల వైసీపీ అధినేతను మెప్పించడమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. చంద్రబాబును టార్గెట్‌ చేస్తే మంత్రి పదవులు పదిలం అనుకున్నవాళ్లు మాజీలు అయ్యారని.. ఇక వారిని మాజీ ఎమ్మెల్యేలుగా చేయడమే మా పని అంటున్నారట టీడీపీ నేతలు. అందుకే ఈసారి ఆ పది మందిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని ప్రతినబూనారట. ప్రత్యర్థిని ఓడించడానికి ఏ పార్టీయైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ.. ఈసారి టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన నియోజకవర్గాల్లో ముందు నుంచీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. ఇంతకుముందు చూసీ చూడనట్టు వదిలేసిన చోట్ల ఈసారి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారట. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు తన టూర్‌లో ఈ పది నియోజకవర్గాలు తప్పకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. మొదటి విడత పర్యటనలో మంత్రి అమర్నాథ్‌ నియోజకవర్గాన్ని టచ్‌ చేసిన చంద్రబాబు ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే రెండో విడత టూర్‌లో గుడివాడ వెళ్లబోతున్నారట. ఇందుకోసం నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ప్రత్యర్థిపై పైచెయ్యి సాధించేందుకు పావులు కదుపుతోందట టీడీపీ.మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ పది మంది గెలిచారని.. మామూలుగా అయితే వీరిక అంత సీన్‌ లేదని టీడీపీ అనుకుంటోందట. వరసగా గెలిచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాలకు కూడా ఈసారి ఓటమి తప్పదని ఓట్ల లెక్కలతో విశ్లేషిస్తున్నారట. కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎన్టీఆర్‌ కుమార్తెను కించపరిచేలా మాట్లాడటం ఆయన ఓటమికి నాందిగా చెబుతున్నాయట టీడీపీ వర్గాలు. దీన్ని గుడివాడలో ఎవరూ సహించడం లేదని.. ముఖ్యంగా మహిళలు నానీ అంటేనే అగ్రహంతో ఉన్నారని లెక్కలేస్తున్నారట. నానీ మీద వరసగా ఓడిపోతున్న ఇంఛార్జ్‌ రావి వెంకటేశ్వరరావును యాక్టివ్‌గా ఉండాలని ఆదేశించిన అధిష్ఠానం.. ఆయనకు అవసరమైన మౌలికవనరుల కల్పనకు కూడా సిద్ధంమైందట. రావి కాకపోతే ఆయనకంటే గట్టి వ్యక్తిని పోటీకి పెట్టే ఆలోచన కూడా ఉందట. సామాజికవర్గం కూడా కొడాలి నాని అంటే అగ్గిమీద గుగ్గిలం అవుతోందటని.. నానీని ఓడించడానికి సామాజికవర్గమే ప్రత్యేక ప్లాన్‌ వేస్తోందట.టీడీపీ మీద ఊ అంటే విరుచుకుపడుతున్న రోజాకు ఈసారి ఓటమి ఖాయమని.. టీడీపీ గట్టిగా చెబుతోంది. అందుకు లెక్కలు కూడా చూపిస్తున్నారట. రాష్ట్రంలో వైసీపీకి 151 సీట్లు వస్తే.. అందులో నగరిలో రోజా చావుతప్పి కన్నులొట్టబోయినట్టు 3 వేల ఓట్లతో బయటపడిందని గుర్తు చేస్తున్నారట. వైసీపీలోనే రోజాను వ్యతిరేకించే వర్గాలు గట్టిగా ఉన్నాయని .. ఈసారి ఆమె గేమ్‌ ఓవర్‌ అని అంటున్నారట. అలాగే మంత్రి అంబటి రాంబాబు మీద కూడా టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. సత్తెనపల్లిలో రాంబాబును ఓడించే గట్టి నేత కోసం అన్వేషిస్తోంది. సొంత పార్టీలోని రెడ్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న రాంబాబును ఓడించడానికి ఇంకొంచె ఎఫెర్ట్‌ పెడితే చాలన్నది టీడీపీ భావన. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీట్‌ కోసం గట్టి పోటీ ఉంది. ఇదే విధంగా నెల్లూరులో మాజీ మంత్రి అనిల్‌, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ రూరల్‌లో కన్నబాబు, మచిలీపట్నంలో పేర్నినాని, పెడనలో జోగి రమేష్‌ కుర్చీలు కదిలించేలా వ్యూహాల్లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారట. వీరేకాకుండా మంత్రి సీదిరి అప్పలరాజు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైగా గట్టి ఫోకస్సే పెట్టారట. జాబితా చూస్తుంటే టార్గెట్‌ టెన్‌ దాటిపోతున్నా.. వడపోతల్లో పదిమందిపై మాత్రం కసితో రగిలిపోతున్నారట తెలుగు తమ్ముళ్లు.

Related Posts