YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫ్యాన్ క్రిందకు టీడీపీ ఓటు బ్యాంకు

ఫ్యాన్ క్రిందకు టీడీపీ ఓటు బ్యాంకు

నెల్లూరు జూన్ 27,
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 82,888 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 19,316 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం పోలయిన ఓట్లు 1,37,000. ఈ ఉప ఎన్నికల్లో 1,02,240 ఓట్లు మేకపాటి విక్రమ్ రెడ్డికి వచ్చాయి. అందులో 19 వేల ఓట్లు బీజేపీకి పడ్డాయి. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లు కూడా వైసీపీకే పడినట్లు అర్థమవుతుంది. టీడీపీకి.... తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా మూడు సంవత్సరాల వైసీపీ పాలనపై అసంతృప్తి పెరిగిందని చంద్రబాబు పదే పదే అంటున్నారు. బాదుడే బాదుడే అంటూ జిల్లాలు పర్యటిస్తున్నారు. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఓట్లు వైసీపీకి పడ్డాయి. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను కూడా టీడీపీయే కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. దీంతో ఆ ఓట్లు వైసీపీ వ్యతిరేక పార్టీకి పడాలి. కానీ వైసీపీకే టీడీపీ అనుకూల ఓట్లు పడినట్లు స్పష్టమవుతుంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 70,482 ఓట్లు వచ్చాయి. టీడీపీ తన ఓటర్లు పోలింగ్ లో పాల్గొనలేదని సమర్థించుకోవచ్చు. కానీ వైసీపీ వ్యతిరేక, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి పడాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల ఫలితాలను చూసిన వారెవరికైనా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కూడా వైసీపీ లాగేసుకుందని అనిపించక మానదు. పరోక్ష సహకారం.. టీడీపీ నాయకులు పోలింగ్ ఏజెంట్లుగా అనేక చోట్ల కూర్చున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అక్కడ బీజేపీకి ఎంతమాత్రం బలం లేదు. దీంతో టీడీపీ నేతలు పోలింగ్ కు పరోక్ష సహకారం అందించారంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి టీడీపీ ఓట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్పక తప్పదు. బీజేపీకి బదిలీ అవ్వాల్సిన ఓట్లు అధికార వైసీపీ వైపు మరలడం చర్చనీయాంశంగా మారింది. ఇది టీడీపీ అగ్రనాయకత్వం ఆలోచించుకోవాల్సిన అంశమే మరి.
లక్ష్యానికి దూరంగా ఓట్లు
ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ యాదవ్‌ పై 82,888 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మొత్తం 20 రౌండ్లుగా కొనసాగింది.దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గౌతమ్‌ రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకం అంటూ భారతీయ జనతా పార్టీ భరత్‌ కుమార్‌ యాదవ్‌ ను పోటీలో నిలిపింది. బీఎస్పీ తరఫున ఓబులేసు, ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 14 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌ నుంచీ మేకపాటి విక్రమ్‌ రెడ్డి తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఒక్కో రౌండ్‌ పూర్తయ్యే సరికి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యం మరింతగా పెరుగుతూనే ఉంది. పోస్టల్‌ బ్యాలెట్లతో సహా మొత్తం 20 రౌండ్లతో కలిపి మేకపాటి విక్రమ్‌ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు.ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రంరెడ్డికి మొత్తం లక్షా 2 వేల 74 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ యాదవ్‌ కు 19 వేల 332 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు 4 వేల 897 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో నోటా ఓట్లు కూడా భారీగా నమోదవడం విశేషం. మొత్తం 4 వేల 179 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇతరులకు 6 వేల 599 ఓట్లు పోలయ్యాయి అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ అంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరికి 90 వేలకు దిగువ మెజారిటీతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.

Related Posts