రాయచోటి
అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆత్మకూరు ప్రజలు పట్టం కట్టారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, మేకపాటి గౌతమ్ రెడ్డికి నివాళిగా 82,888 మెజారిటీ రావడం, ప్రత్యర్తులకు డిపాజిట్ కూడా రాకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన ప్రజలకున్న నమ్మకం ఏ పాటిదో అర్థమైందన్నారు. ఉపఎన్నిక కౌంటింగ్ మొదలైన మొదటి రౌండ్ నుంచి వైఎస్ ఆర్ సిపి జోరు కొనసాగుతూనే వచ్చిందన్నారు. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలలో పోటీ చేసిన బీజేపీ, ఆ పార్టీకి లోపాయికారిగా మద్దతు ఇచ్చినా వరుస ఓటములను చవిచూసిందన్నారు. తాను ఉపఎన్నికల సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించడం జరిగిందన్నారు. అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి జగన్ గారిపై చూపిన ఆదరాభిమానాలు మరువ లేనివన్నారు. ధన ప్రభావం, మద్యం ప్రభావం ఎక్కడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పాలనపైన ,న్యాయకత్వంపైన అత్యంత నమ్మకంతో,దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కుటుంభంపై ఉన్న ప్రేమతో మొగ్గుచూపి అధిక మెజారిటీతో పట్టం కట్టారన్నారు., సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మరో సారి ఋజువైందన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజక వర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.