YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధర్మాన సోదరుల మధ్య ఫైట్

ధర్మాన సోదరుల మధ్య ఫైట్

శ్రీకాకుళం, జూన్ 28,
ధర్మాన కృష్ణదాస్‌.. ధర్మాన ప్రసాదరావు. ఇద్దరూ సోదరులే. కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎంగా చేస్తే.. మొన్నటి కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో అన్నను సాగనంపి.. తమ్ముడు ప్రసాదరావును మంత్రిని చేశారు. కృష్ణదాస్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కృష్ణదాస్ మంత్రిగా ఉండగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రసాదరావు.. నేడు అన్న కృష్ణదాస్ పార్టీ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ్ముడు డుమ్మా కొట్టేస్తున్నారు. మంత్రి పదవిలో ఉండగా దాసన్న చుట్టూ ప్రదర్శన చేసింది కేడర్‌. ప్రసాదరావు మంత్రి కావడంతో ఆ కేడర్‌ ఇటు టర్న్‌ తీసుకుంది. అంతేనా.. కృష్ణదాస్‌ ఎమ్మెల్యేగా ఉన్న నరసన్నపేట వైసీపీ నేతలు సైతం పనులకోసం ధర్మాన ప్రసాదరావును ఆశ్రయిస్తున్నారు. ఇది అన్నకు అస్సలు రుచించని అంశం. ఆ ఆవేదన నరసన్నపేట వైసీపీ ప్లీనరీలో కృష్ణదాస్‌ మాటల్లో తన్నుకొచ్చింది.హద్దు మీరితే అధినేత సీఎం జగన్‌కు కంప్లయింట్‌ చేస్తానన్నది కృష్ణదాస్‌ వార్నింగ్‌. దాంతో అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కు చేరుకుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కృష్ణదాస్‌ కామెంట్స్‌ చుట్టూనే చర్చ జరుగుతోంది. చిన్నా చితక నేతలపై అధినేతకు ఫిర్యాదు చేయాల్సిన పనిలేదని.. ఆయన అనడంతో.. తమ్ముడు ప్రసాదరావునే కృష్ణదాస్‌ గురి పెట్టినట్టు అర్థం అవుతోంది. వచ్చే ఎన్నికలలోపు బ్రదర్స్‌ మధ్య రాజుకున్న ఈ అగ్గి బడబాగ్నిగా మారే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట.నరసన్నపేటలో చాలా మంది వైసీపీ నేతలు.. ప్రసాదరావుకు తెలుసు. మొన్న మంత్రి అయిన తర్వాత ఆ పాత పరిచయాలు మరింత యాక్టివ్‌ అయ్యాయి. అయితే కృష్ణదాస్‌కు తెలియకుండా పనులు చక్కబెట్టడమే సమస్యకు కారణమన్నది పార్టీ వర్గాల మాట. దీంతో వర్గ రాజకీయం బుసలు కొడుతోంది. అది పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఆ మధ్య నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇచ్ఛాపురం, టెక్కలి లో గ్రూపు రాజకీయాలను సెట్ చేసేందుకు అన్నదమ్ములు కలిసి కృషి చేసినా తర్వాత బ్రదర్స్‌ మధ్యే గ్రూపు ఫైట్‌ మరో అంకానికి చేరుకుంది. సమస్య శ్రుతి మించుతోంది అన్నప్పుడల్లా మంత్రి బొత్స సత్యనారాయణ ఎంట్రీ ఇవ్వక తప్పడం లేదట. దీంతో బొత్స పాల్గొనే సభలకు ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లే పనిలో ఉన్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. శ్రీకాకుళంలో మాత్రం అన్నదమ్ముల మధ్యే ఎన్నికల రణతంత్రం పదునెక్కుతోంది. అది అధికారపార్టీ శ్రేణులకు మింగుడు పడని పరిస్థితి. సమస్య ముదిరి వార్నింగ్‌లు ఇచ్చుకునే వరకు వెళ్లడంతో రేపటి రోజున ఇంకేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరి.. ధర్మాన సోదరుల పంచాయితీకి ముగింపు పలకడానికి వైసీపీలో ఎవరు చొరవ తీసుకుంటారో చూడాలి.

Related Posts